«لَا يَدْخُلُ الْجَنَّةَ قَتَّاتٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6056]
المزيــد ...
హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను:
“అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6056]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అపోహలను కల్పించేవాని గురించి వివరిస్తున్నారు. ‘నమీమా’ అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య (లేక రెండు సమూహాల మధ్య, రెండు జాతుల మధ్య) కలహాలు రేకెత్తించే ఉద్దేశ్యంతో ఒకరి మాటలను మరొకరికి చేరవేయుట. అలా చేయడం వలన వారి మధ్య అపోహలు ఉత్పన్నమవుతాయి. అవి కలహాలకు, తద్వారా అశాంతికి దారి తీస్తాయి. అటువంటి వారు కఠినమైన శిక్షకు పాత్రులు. స్వర్గంలోనికి ప్రవేశించడానికి అర్హులు కారు.