«لَا تَجْعَلُوا بُيُوتَكُمْ قُبُورًا، وَلَا تَجْعَلُوا قَبْرِي عِيدًا، وَصَلُّوا عَلَيَّ؛ فَإِنَّ صَلَاتَكُمْ تَبْلُغُنِي حَيْثُ كُنْتُمْ».
[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 2042]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”.
[ప్రామాణికమైనది] - [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 2042]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇళ్ళలో సలాహ్ (నమాజు) ఆచరించకుండా, వాటిని స్మశానాల మాదిరి అనిపించేలా చేయడాన్ని నిషేధించినారు. ఎందుకంటే స్మశానాలలో నమాజులు చదువబడవు. తన సమాధిని మాటిమాటికి దర్శించడాన్ని, ఒక అలవాటుగా అక్కడ మాటిమాటికీ సమావేశం కావడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. ఎందుకంటే అలా చేయడం షిర్క్’నకు దారి తీసే కారణాలలో ఒకటి కాగలదు. ఈ భూప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, తనపై (అల్లాహ్ యొక్క) శాంతి కొరకు ప్రార్థించమని (దరూద్ పఠించమని) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. ఆ దరూద్’లు ఎంత దూరం నుండైనా, దగ్గరి నుండైనా ఒకేలా తనకు చేరుతాయని తెలియ జేస్తున్నారు. కనుక వారి సమాధిని మాటిమాటికి దర్శించడానికి తొందర పడవలసిన అవసరం లేదు.