«لَا تَسُبُّوا الْأَمْوَاتَ، فَإِنَّهُمْ قَدْ أَفْضَوْا إِلَى مَا قَدَّمُوا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1393]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
"చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు".
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 1393]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడరాదని, వారి గౌరవానికి భంగం కలిగించరాదని వివరిస్తున్నారు. అలా చేయడం నైతిక విలువల అధమ స్థాయిని సూచిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వారు తమ సత్కర్మల లేక దుష్కర్మల ఫలాన్ని పొందడానికి వెళ్ళిపోయినారు. వారి పట్ల చెడుగా మాట్లాడుట, వారి గౌరవానికి భంగం కలిగే రీతిలో మాట్లాడుట వారిని చేరదు, కానీ బ్రతికి ఉన్నవారిని బాధిస్తుంది.