«لَا ضَرَرَ وَلَا ضِرَارَ، مَنْ ضَارَّ ضَرَّهُ اللَّهُ، وَمَنْ شَاقَّ شَقَّ اللَّهُ عَلَيْهِ».
[صحيح بشواهده] - [رواه الدارقطني] - [سنن الدارقطني: 3079]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు”.
[సాక్షులచే దృఢమైనది] - [దానిని దారు ఖుత్నీ ఉల్లేఖించారు] - [سنن الدارقطني - 3079]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు - ఇతరులకు హాని కలిగించుట అనేది అది ఏ రూపంలో ఉన్నా, ప్రతి ఒక్కరూ తన స్వయం నుండి మరియు ఇతరుల నుండి దానిని దూరం చేయాలి. కనుక ఏ ఒక్కరు కూడా తన స్వయానికి హాని తలపెట్టు కొనుటకు అనుమతి లేదు. అలాగే ఇతరులకు హాని తలపెట్టుటకు అనుమతి లేదు.
మరియు హానికి ప్రతీకారంగా తిరిగి హాని తలపెట్టడానికి అనుమతి లేదు, శిక్షలో భాగమైతే తప్ప. అది కూడా హద్దుమీరకుండా, ఉల్లంఘనలకు పాల్బడకుండా. ఎందుకంటే హాని, హాని ద్వారా తొలగించబడదు.
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలకు హాని తలపెట్టే వానికి, (అల్లాహ్ తరఫు నుండి) హాని కలుగుతుందని, ప్రజలపట్ల కఠినంగా ఉండే వానికి (అల్లాహ్ తరఫు నుండి) కాఠిన్యమే లభిస్తుందని - హెచ్చరించినారు.
النهي عن المجازاة بأكثر من المِثْل.سلا