«الصَّلَوَاتُ الْخَمْسُ، وَالْجُمُعَةُ إِلَى الْجُمُعَةِ، وَرَمَضَانُ إِلَى رَمَضَانَ، مُكَفِّرَاتٌ مَا بَيْنَهُنَّ إِذَا اجْتَنَبَ الْكَبَائِرَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 233]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:
“పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ప్రతి రోజూ విధిగా ఆచరించే ఐదుపూటల నమాజులు, ప్రతి శుక్రవారము ఆచరించే ‘శుక్రవారపు జుమఅహ్ నమాజు’, మరియు ప్రతి సంవత్సరం రమదాన్ నెల ఉపవాసాలు విధిగా ఆచరించుట – వాటి మధ్య (దాసుని వల్ల) జరిగే చిన్న పాపములకు అవి పరిహారంగా మారతాయి; అయితే పెద్ద పాపములకు దూరంగా ఉండాలి. పెద్ద పాపములు (అల్ కబాయిర్) అంటే - వ్యభిచారానికి, వివాహేతర లైంగిక సంబంధాలకు పాల్బడుట, మద్యపానము చేయుట వంటివి పరిహరించబడవు. అవి క్షమింపబడుట కొరకు పశ్చాత్తాపము తప్పనిసరి.
الكبائر هي الذنوب التي ورد فِيهِا حد فِي الدُّنْيَا، أَو جَاءَ فِيهِا وَعِيد فِي الْآخِرَة؛ بالعَذَاب، أَو الغضب، أَو كان فيها تهديدٌ، أَو لعنٌ لفَاعلِها، كالزنى وشرب الخمر.الحديث