«مَنْ أَحَبَّ أَنْ يُبْسَطَ لَهُ فِي رِزْقِهِ، وَيُنْسَأَ لَهُ فِي أَثَرِهِ، فَلْيَصِلْ رَحِمَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5986]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)”.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుటను గురించి ఉద్బోధిస్తున్నారు. బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుట, కొనసాగించుట అనేది తరుచుగా వెళ్ళి వారిని కలుస్తూ ఉండుట, వారితో దయతో, స్నేహంతో మెలుగుట, వారికి అవసరమైనప్పుడు వారి కొరకు శారీరకంగా శ్రమ పడుట, ఆర్థికంగా సహాయం అందించుట మొదలైన వాటి వలన జరుగుతుంది. ఆ విధంగా బంధుత్వాలను నిలిపి ఉంచుకోవడం, కొనసాగించడం జీవనోపాధి విస్తరించడానికి మరియు జీవిత కాలం పొడిగించ బడడానికి కారణం అవుతుంది.