ఉప కూర్పులు

హదీసుల జాబితా

1. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దాడిలో, చంపబడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని ఆయన చూసినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను, పిల్లలను చంపడాన్ని ఖండించారు, బహిరంగంగా నిందించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
2. ; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే మార్గము మాత్రమే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
3. అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
4. “(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
5. “నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
6. “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
7. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?
عربي ఇంగ్లీషు ఉర్దూ
8. “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
9. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా ఇలా దుఆ చేస్తూ ఉండేవారు “యా ముఖల్లిబల్ ఖులూబ్, సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్” (ఓ హృదయాలను త్రిప్పివేసేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై దృఢంగా ఉండేలా చేయి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
10.
عربي ఇంగ్లీషు ఉర్దూ
11. “లా ఇలాహ ఇల్లల్లాహ్! (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవరూ లేరు), వచ్చి పడబోయే అరిష్టము నుండి ఈ అరబ్బులు వినాశం గాను...” అంటూ ఆయన తన బొటన వేలిని, చూపుడు వేలునీ కలిపి ఒక వృత్తాకారము చేసి చూపుతూ “...ఈ రోజు, ‘యా’జూజ్’ మరియు మ’జూజ్’ల గోడలో ఇంత రంధ్రం చేయబడింది” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
12. ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిగి ఉండేవారు. ఒకవేళ ఎపుడైనా ఆయన తనకు ఇష్టం లేనిది ఏదైనా చూస్తే, ఆయన ముఖాన్ని చూసి మేము అది వెంటనే గ్రహించేవారము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
13. “ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
14. “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
15. “ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము
عربي ఇంగ్లీషు ఉర్దూ
16. “ ఒక వ్యక్తి ని ప్రళయదినం రోజున తీసుకురావడం జరుగుతుంది, ఆ పై అతన్ని నరకం లో విసిరివేయడం జరుగుతుంది, అతని పొట్ట నుండి ప్రేగులు బయటికి పడి గాడిద తన తిరగలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
17. “డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం వైపునకు) జారుతూనే ఉంది. ఇప్పుడు అది నరకపు అడుగు భాగాన్ని తాకింది.” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
18. “ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
19. “నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
20. “నాకంటే ముందు ఎవరికీ ప్రసాదించబడని ఐదు (ప్రత్యేకతలు) నాకు ప్రసాదించబడినాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
21. ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
22. “అల్లాహ్ ఇలా పలికినాడు: ఆదము కుమారుని ఆచరణలన్నీ అతని కొరకే, ఒక్క ఉపవాసం తప్ప; అది నాకొరకు, మరియు దానికి నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను - 10 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
23. “మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి). ఒకవేళ వారి మధ్య ఒక చెట్టు, లేదా ఒక గోడ లేక ఒక పెద్ద శిల వచ్చినట్లైతే (దానిని దాటిన తరువాత) మరల అతణ్ణి కలిసినపుడు కూడా అతనికి సలాం చేయాలి (సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అయినప్పటికీ)
عربي ఇంగ్లీషు ఉర్దూ
24. మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో
عربي ఇంగ్లీషు ఉర్దూ
25. “ఇస్రా (మేరాజ్) యాత్ర జరిగిన రాత్రి నేనుఇబ్రాహీం (అలైహిస్సలాం) ను కలిసాను. ఆయన ఇలా అన్నారు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నీ ఉమ్మత్’కు నా సలాం తెలియజేయి, వారికి తెలియజేయి స్వర్గములో స్వచ్ఛమైన నేల మరియు మధురమైన నీరు ఉన్నాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
26. “నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం
عربي ఇంగ్లీషు ఉర్దూ
27. “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు మరియు పరిశుద్ధమైన వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు. ప్రవక్తలకు ఆదేశించిన దానినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
28. “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
29. “దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
30. “ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
31. “సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
32. “ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
33. అల్లాహ్ నామస్మరణంతో (దిక్ర్ తో) నీ నాలుకను తడిగా ఉంచు
عربي ఇంగ్లీషు ఉర్దూ
34. “అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన తరువాత) అతడు ఆ స్థానంలో ఉన్నాడు. మరియు షహదా పలుకక ముందు అతడు ఏ స్థానంలో ఉన్నాడో నీవు ఆ స్థానంలో ఉంటావు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
35. “ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
36. “నిశ్చయంగా, అల్లాహ్‌ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
37. “(వారు చెప్పినది) వినండి మరియు అనుసరించండి. ఎందుకంటే, వారికి అప్పగించబడిన బాధ్యత వారిపై ఉంది. మీకు అప్పగించబడిన బాధ్యత మీపై ఉంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
38. “ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
39. “యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చెప్పకండి. మరియు ఒకవేళ మీకు వారిలో ఎవరినైనా దారిలో ఎదురైతే వారిని దారి అంచుకు పోయేలా చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
40. “(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడిగా పరిగణించబడడు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
41. “మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
42. “పిసినారి ఎవరంటే, తన సమక్షములో నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్ధించని వాడు (దరూద్ పఠించనివాడు).” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
43. ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
44. “అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
45. “అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ అల్లదీ హువ ఇస్మతు అమ్రీ - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
46. “రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్” (ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)
عربي ఇంగ్లీషు ఉర్దూ
47. “అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
48. “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి, ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; వ అఊజుబిక మిన్ షర్రి కుల్లిహి ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం
عربي ఇంగ్లీషు ఉర్దూ
49. “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక” (ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)
عربي ఇంగ్లీషు ఉర్దూ
50. “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)
عربي ఇంగ్లీషు ఉర్దూ
51. “అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్”
عربي ఇంగ్లీషు ఉర్దూ
52. ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
53. “బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
54. “(ఓ అలీ!) నీవు ఇలా పలుకు “అల్లాహుమ్మహ్’దినీ వసద్దిద్’నీ” (ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం ప్రసాదించు మరియు నేను తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి), ఈ దుఆ చేయునపుడు నీవు మార్గదర్శకం కొరకు ప్రార్థిస్తున్నపుడు ఆయన చేత నీవు సరళ మార్గములో మార్గదర్శకం చేయబడుతున్నావు అని మనసులో భావించు. అలాగే తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి అని ప్రార్థిస్తున్నపుడు, ఎక్కుపెట్టబడిన బాణము సూటిగా లక్ష్యం ఛేదించడాన్ని మనసులో ఊహించుకో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
55. “నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
56. “ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
57. “ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
58. “మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
59. “ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా చనిపోయినపుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
60. “బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
61. “ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు శాశ్వతంగా జీవితులై ఉంటారు, ఎన్నటికీ చనిపోరు; మీరు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు, ఎన్నటికీ వృద్ధులు కారు; మరియు మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, సంపన్న పరిస్థితుల్లో జీవిస్తారు మరియు ఎప్పటికీ నిరుపేదలుగా మారరు;
عربي ఇంగ్లీషు ఉర్దూ
62. “స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: “నేను మీకు ఇంకా ఏమైనా ప్రసాదించాలని కోరుకుంటున్నారా?”
عربي ఇంగ్లీషు ఉర్దూ
63. “సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
64. “ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
65. “మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
66. “మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
67. “ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
68. “నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
69. “ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
70. “ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
71. “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
72. “మీలో ఎవరూ మీ భుజాలపై ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒకే వస్త్రములో సలాహ్ (నమాజు) ఆచరించకండి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
73. (నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
74. “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు ఆచరించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించుట కొరకు సలాం చెప్పినపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు అనుగ్రము మీపై కురియుగాక) అని, మరియు తన ఎడమ వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” (అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ మీపై కురియుగాక) అని పలికినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
75. “అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
76. “అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
77. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
78. “ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
79. “ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
80. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో పంక్తి వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించడాన్ని చూసినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఆ నమాజు మరలా చేయమని ఆదేశించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
81. “తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
82. “శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
83. “పురుషునితో గానీ, లేక స్త్రీతో గానీ మలద్వారము ద్వారా సంభోగములో పాల్గొనే వాని వైపునకు అల్లాహ్ (తీర్పు దినమున) కన్నెత్తి కూడా చూడడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
84. “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
85. “ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
86. “మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ