أن النبي صلى الله عليه وسلم كان لا يَدع أربعا قَبل الظهر وركعتين قبل الغَدَاة.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1182]
المزيــد ...
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 1182]
ఈ హదీథులో ఆయిషా (రదియల్లాహు అన్హా) : తన ఇంటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వచ్ఛందంగా ఆచరించవలసిన నమాజులను ఎన్నడూ విడిచి పెట్టలేదని, ఆయన నిరంతరం వాటిని ఆచరించేవారని తెలియ జేస్తున్నారు; జుహ్ర్ సలాహ్ కు ముందు రెండు-రెండు రకాతులుగా నాలుగు రకాతుల సున్నత్ సలాహ్, మరియు ఫజ్ర్ సలాహ్ కు ముందు రెండు రకాతుల సున్నత్ సలాహ్ నిరంతరం ఆచరించేవారని తెలియజేస్తున్నారు.