కూర్పు:
+ -
عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:

كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُكْثِرُ أَنْ يَقُولَ: «يَا مُقَلِّبَ القُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ»، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ، آمَنَّا بِكَ وَبِمَا جِئْتَ بِهِ فَهَلْ تَخَافُ عَلَيْنَا؟ قَالَ: «نَعَمْ، إِنَّ القُلُوبَ بَيْنَ أُصْبُعَيْنِ مِنْ أَصَابِعِ اللهِ يُقَلِّبُهَا كَيْفَ يَشَاءُ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2140]
المزيــد ...

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా ఇలా దుఆ చేస్తూ ఉండేవారు “యా ముఖల్లిబల్ ఖులూబ్, సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్” (ఓ హృదయాలను త్రిప్పివేసేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై దృఢంగా ఉండేలా చేయి). నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! మేము మిమ్మల్ని విశ్వసించినాము, మరియు మీరు ఏ సందేశమునైతే తెచ్చినారో దానిని విశ్వసించినాము. మీరు మా గురించి భయపడుతున్నారా?” దానికి ఆయన “అవును, (ఎందుకంటే) హృదయాలు అల్లాహ్ చేతి రెండు వేళ్ళమధ్య ఉంటాయి. ఆయన వాటిని తన చిత్తము వచ్చిన వైపునకు మరల్చుతాడు” అన్నారు.”

الملاحظة
Rasûlullah -sallallahu aleyhi ve sellem- rükû ve secdede şu duayı çokça okurdu: In the translation it says that he recites this dua frequently in ruku an in sujud. Please correct.
النص المقترح لا يوجد...

[దృఢమైనది] - - [سنن الترمذي - 2140]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సాధారణంగా అల్లాహ్’తో తరుచూ చేసే దుఆ (విన్నపం) - ధర్మంలో, మరియు ఆయనకు విధేయునిగా ఉండుటలో స్థిరత్వం ప్రసాదించమని అల్లాహ్’ను కోరడం, మరియు వాటి నుండి (ధర్మము నుండి, ఆయన విధేయత నుండి) మరలిపోకుండా, మరియు మార్గభ్రష్టత్వం నుండి, తప్పుదోవల నుండి దూరంగా ఉండేలా చేయమని అల్లాహ్ ను వేడుకోవడం. అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆను తరుచూ పునరావృతం చేస్తూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "హృదయాలు అల్లాహ్ యొక్క రెండు వేళ్ల మధ్య ఉన్నాయి. ఆయన తాను కోరిన విధంగా వాటిని తిప్పుతాడు.” అని పలికినారు. విశ్వాసమైనా, అవిశ్వాసమైనా అవి ఉండే స్థానము ‘హృదయం’. అరబీ భాషలో హృదయాన్ని ‘అల్ ఖల్బ్’ అంటారు. ‘ఖల్బ్’ అనే పదానికి అరబీ భాషలో ‘దొర్లుట’; ‘నిలకడలేని’; ‘త్రిప్పివేయు’; ‘స్థిరత్వములేని’ అనే అర్థాలున్నాయి. ఒక కుండలో దేనినైనా ఉడకబెడుతూ ఉంటే, అది ఏవిధంగా తొందరలోనే మార్పునకు లోనవుతుందో, హృదయం కూడా అదే విధంగా స్థిరత్వం లేకుండా మారిపోతూ, తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే అరబీ భాషలో హృదయాన్ని “అల్’ఖల్బ్” అన్నారు. కనుక అల్లాహ్ తాను కోరిన వాని హృదయాన్ని మార్గదర్శకంపై స్థిరంగా ఉంచుతాడు; దానిని ధర్మములో స్థిరపరుస్తాడు; మరియు తాను కోరిన వాని హృదయాన్ని సన్మార్గమునుండి తప్పిస్తాడు, మార్గభ్రష్టత్వంలో విడిచి పెడతాడు.

من فوائد الحديث

  1. ఈ హదీసులో, తన ప్రభువు పట్ల, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను చూడవచ్చు, మరియు ఆయనను వేడుకొవడం చూడవచ్చు; అలాగే ఆ విధంగా దుఆ చేయమని తన ఉమ్మత్’కు మార్గనిర్దేశం చేయడాన్ని చూడవచ్చు.
  2. ధర్మములో స్థిరంగా ఉండుట; మరియు స్థిరంగా ఉండుట కొరకు పట్టుదల యొక్క ఆవశ్యకత తెలుస్తున్నది. వాస్తవానికి ప్రతి వ్యక్తికీ అతని ముగింపే కదా ముఖ్యం!
  3. అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ అతడిని ఇస్లాం పై స్థిర పరచకపోతే, కనురెప్ప ఆడినంత కాలం కూడా ఇస్లాం పై స్థిరంగా ఉండగలిగే శక్తి అతనికి లేదు.
  4. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనను అనుసరిస్తూ, సర్వోన్నతుడైన అల్లాహ్’తో ఈ దుఆను తరుచూ చేస్తూ ఉండాలనే హితబోధ ఉన్నది.
  5. ఇస్లాం ధర్మం పై స్థిరత్వం అనేది అల్లాహ్ తరఫు నుండి ప్రసాదించబడే ఒక గొప్ప అనుగ్రహం. అందుకు దాసుడు తన ప్రభువుకు అన్ని వేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దానిని సాధించుట కొరకు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الليتوانية الدرية الصربية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా