కూర్పు:
+ -
عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه قَالَ: خَرَجَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي أَضْحَى أَوْ فِطْرٍ إِلَى المُصَلَّى، فَمَرَّ عَلَى النِّسَاءِ، فَقَالَ:

«يَا مَعْشَرَ النِّسَاءِ، تَصَدَّقْنَ، فَإِنِّي أُرِيتُكُنَّ أَكْثَرَ أَهْلِ النَّارِ» فَقُلْنَ: وَبِمَ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «تُكْثِرْنَ اللَّعْنَ، وَتَكْفُرْنَ العَشِيرَ، مَا رَأَيْتُ مِنْ نَاقِصَاتِ عَقْلٍ وَدِينٍ أَذْهَبَ لِلُبِّ الرَّجُلِ الحَازِمِ مِنْ إِحْدَاكُنَّ»، قُلْنَ: وَمَا نُقْصَانُ دِينِنَا وَعَقْلِنَا يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «أَلَيْسَ شَهَادَةُ المَرْأَةِ مِثْلَ نِصْفِ شَهَادَةِ الرَّجُلِ» قُلْنَ: بَلَى، قَالَ: «فَذَلِكِ مِنْ نُقْصَانِ عَقْلِهَا، أَلَيْسَ إِذَا حَاضَتْ لَمْ تُصَلِّ وَلَمْ تَصُمْ» قُلْنَ: بَلَى، قَالَ: «فَذَلِكِ مِنْ نُقْصَانِ دِينِهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 304]
المزيــد ...

అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఈద్ అల్ అద్’హా దినమునాడో లేదా ఈద్ అల్ ఫిత్ర్ దినమునాడో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (ఈద్) నమాజు ఆచరించుటకు నమాజు ఆచరించు ప్రదేశానికి బయలుదేరినారు. దారిలో వారు ఒక స్త్రీల గుంపును దాటుకుంటూ వెళ్ళినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా పలికినారు:
“ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”. దానికి వారు “మా ధర్మములో మరియు వివేకములో ఉన్న లోపం ఏమిటి?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగినారు:(షరియత్’లో) ఒక స్త్రీ సాక్ష్యము, పురుషుని సగం సాక్ష్యానికి సమానం కాదా? (అంటే ఇద్దరు స్త్రీల సాక్ష్యము ఒక పురుషుని సాక్ష్యమునకు సమానము కాదా?”) దానికి వారు “అవును” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది వివేకములో ఆమె లోపము. అలాగే స్త్రీ బహిష్ఠు స్థితిలో ఉన్నపుడు ఆమె నమాజు ఆచరించదు, ఉపవాసము పాటించదు, అవును కదా?” అని ప్రశ్నించారు. దానికి వారు “అవును” అని సమాధానం ఇచ్చినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది ధర్మములో ఆమె కొరత” అన్నారు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 304]

వివరణ

ఒకసారి ఈద్ దినమునాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ నమాజు ఆచరించుటకు, నమాజు ఆచరించే ప్రదేశానికి బయలుదేరినారు. ఆ సందర్భముగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మహిళలకు ప్రత్యేక ప్రసంగం ఇస్తానని వాగ్దానం చేశారు మరియు ఆ రోజున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: “ఓ స్త్రీలారా! ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండండి, ఎక్కువగా క్షమాభిక్ష కొరకు అల్లాహ్’ను అర్థిస్తూ ఉండండి; పాపముల పరిహారం కొరకు ఉన్న సాధనాలలో అవి గొప్పసాధనాలు; ఎందుకంటే ఇస్రా ప్రయాణపు రాత్రి నరకవాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను.”
అప్పుడు వారిలో తెలివైన, మంచి గ్రహణశక్తిగల, మరియు గౌరవప్రదమైన ఒక మహిళ: “ ఓ రసూలుల్లాహ్! నరకనివాసులలో ఎక్కువ మంది మేమే ఎందుకుంటాము?” అని ప్రశ్నించినది.
అప్పుడు వారిలో తెలివైన, మంచి గ్రహణశక్తిగల, మరియు గౌరవప్రదమైన ఒక మహిళ: “ ఓ రసూలుల్లాహ్! నరకనివాసులలో ఎక్కువ మంది మేమే ఎందుకుంటాము?” అని ప్రశ్నించింది. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని ఇలా వర్ణించారు: తెలివితేటలు, హేతుబద్ధత, జ్ఞానం మరియు తన వ్యవహారాలపై నియంత్రణ ఉన్న వ్యక్తిని కూడా దారి తప్పించడంలో మీ కంటే ఎక్కువ తెలివితేటలు మరియు నైతికత లోపించిన వారిని నేను చూడలేదు.
ఆమె ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మా వివేకములో మరియు ధర్మములో కొరత ఏమిటి?”
అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వివేకములో కొరత విషయానికొస్తే, (షరియతులో) ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడి సాక్ష్యానికి సమానం; వివేకములో కొరత అంటే ఇదే. ధర్మములో కొరత అంటే వారి మంచి పనులు చేసే అవకాశాలు తగ్గడం, ఎందుకంటే ఒక స్త్రీ రుతుస్రావం కారణంగా ఆ కాలంలో రాత్రింబవళ్ళు నమాజు ఆచరించకుండా గడుపుతుంది; అలాగే రుతుస్రావం కారణంగా రమదాన్‌ మాసములో తక్కువ రోజులు ఉపవాసం ఉంటుంది; ధర్మములో కొరత అంటే ఇదే. అయితే, వారు దానికి నిందార్హులు గానీ లేదా జవాబుదారులు గానీ కాదు; ఎందుకంటే ఇది వారి సహజ స్వభావంలో భాగం, పురుషులు సంపద పట్ల సహజమైన ప్రేమ, వారి విషయాలలో తొందరపాటు, అజ్ఞానం మరియు ఇతర లక్షణాలతో సృష్టించబడినట్లే (స్త్రీలు కూడా సహజంగానే ఆ విధంగా సృష్టించబడినారు). అయితే, వారితో మోహంలో పడకుండా ఉండటానికి ఇక్కడ ఇది హెచ్చరికగా ప్రస్తావించబడింది.

من فوائد الحديث

  1. మహిళలు ఈద్ ప్రార్థనకు హాజరు కావడం మరియు వారి కొరకు ప్రత్యేక ప్రసంగం ఇవ్వడం అభిలషణీయము.
  2. భర్త పట్ల కృతజ్ఞత లేకపోవడం మరియు తరచుగా తిట్లు, శాపనార్థాలు పెట్టడం “కబాయిర్” (పెద్ద పాపాలు) గా భావించబడతాయి, ఎందుకంటే నరకంలో వేయబడుట అనేది ఆ పాపం ఎంత పెద్ద పాపమో సూచిస్తుంది.
  3. విశ్వాసం పెరగవచ్చు మరియు తగ్గవచ్చు అని ఇది సూచిస్తున్నది. ఒకరి విశ్వాసం మరియు అతని ధర్మం సమృద్ధిగా ఆరాధనలను ఆచరించినప్పుడు పెరుగుతుంది మరియు ఆరాధనలను ఆచరించకపోవడం, లేక తక్కువగా ఆచరించడం వలన అది అతని ధర్మములో తగ్గుదలగా భావించబడుతుంది.
  4. ఇమాం అన్-నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: తెలివితేటలు, వివేకము పెరగవచ్చును మరియు తగ్గవచ్చును; అలాగే విశ్వాసం కూడా. ఇక్కడ స్త్రీలలో కొరత గురించి ప్రస్తావించడం అంటే దానికి వారిని నిందించడం ఉద్దేశ్యం కాదు, ఎందుకంటే అది వారి సహజ స్వభావంలో భాగం. ఇక్కడ ప్రస్తావించబడడం వాటి పట్ల మోహంలో పడకుండా ఉండటానికి హెచ్చరికగా ఉద్దేశించబడింది. అందుకే ప్రస్తావించబడిన శిక్ష కృతఘ్నత మరియు ఇతర పాపాలతో ముడిపెట్టబడినది, కొరతతో కాదు. వారి ధర్మములోని కొరత, అది దారి తీసే పాపానికి మాత్రమే పరిమితం కాదు; వాస్తవానికి ఇది విస్తృత పరిధిని కలిగి ఉంటుంది.
  5. దీని అర్థం ఒక విధ్యార్థి లేదా పాలిత ప్రజలలో ఎవరైనా తనకు ఏదైనా విషయం అస్పష్టంగా ఉంటే తన గురువును/పండితుడిని లేదా తన నాయకుడిని లేక పాలకుడిని తన మాటలను స్పష్టం చేయమని అడగవచ్చు.
  6. ఇందులో ఒక స్త్రీ సాక్ష్యం, పురుషుడి సాక్ష్యంలో సగం మాత్రమే అని తెలుస్తున్నది, దానికి కారణం ఆమెలో ఖచ్చితత్వం లేకపోవడం లేక లోపించడం.
  7. ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తన వ్యాఖ్య – “ఏ విషయంలోనైనా కొరత కలిగిన స్త్రీని నేను చూడలేదు...” - పై ఇలా అన్నారు: నరకాగ్నిలో స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఉండడానికి ఇది కూడా ఒక కారణం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, వివేకం గల ఒక వ్యక్తి తన హేతువును కోల్పోయి అతడు తగని పనికి పాల్బడేలా, లేదా అతడు తగని పలుకులు పలికేలా స్త్రీలు చేయగలరు అనేటట్లయితే, వారికి ఆ పాపములో తప్పనిసరిగా భాగం ఉంటుంది; నిజానికి అందులో వారు అతడిని మించిపోతారు.
  8. బహిష్ఠుస్థితిలో స్త్రీలు నమాజు ఆచరించుట మరియు ఉపవాసములు ఆచరించుట నిషేధము (హరాం) అని ఈ హదీథు ద్వారా తెలుస్తున్నది. అలాగే ప్రసవానంతర స్థితిలో కొనసాగుతున్న స్త్రీలకు కూడా (ఆ స్థితి తొలగిపోయేంత వరకు) ఇది వర్తిస్తుంది. అయితే రమదాన్ మాసములో బహిష్ఠు స్థితి కారణంగా లేక ప్రసవానంతర స్థితి కారణంగా కోల్పోయిన ఉపవాసములను, వారు ఆ స్థితి నుండి పరిశుద్ధత పొందిన తరువాత వాటిని పాటించి పూర్తి చేసుకోవలసి ఉంటుంది.
  9. ఈ హదీథు ద్వారా – స్త్రీల ప్రశ్నలకు వారిని మందలించడం గానీ, లేక నిందించడం గానీ చేయకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓపికగా, సావధానంగా సమాధానం ఇవ్వడంలో వారి మృదుస్వభావం తెలుస్తున్నది.
  10. ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: దానధర్మాలు చేయడం (తీర్పుదినము నాడు) శిక్షను తొలగిస్తాయి, మరియు రెండు సృష్ఠితాల నడుమ చోటు చేసుకున్న పాపములకు పరిహారంగా మారుతాయి.
  11. ఇమాం అన్-నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ధర్మములో స్త్రీల కొరత వారి ఋతుస్రావం సమయంలో నమాజు మరియు ఉపవాసాలను వదిలివేయడం వల్ల వస్తుంది. ఒక వ్యక్తి సమృద్ధిగా ఆరాధనలు చేసినప్పుడు అతని విశ్వాసం మరియు అతని ధర్మానుసరణ పెరుగుతుంది మరియు తక్కువ ఆరాధనలు చేయడం వలన తగ్గుతుంది. అంతేకాకుండా, ధర్మానుసరణలో లోపం పాపకార్యంగా పరిగణించబడవచ్చు, ఉదాహరణకు నమాజు, ఉపవాసం లేదా ఏదైనా ఇతర తప్పనిసరి ఆరాధనను (ఫర్ద్ ఇబాదత్’ను) షరియత్ ఆమోదించే ఏ కారణం లేకుండా వదిలివేయడం; అలాగే ధర్మానుసరణలో లోపం పాపకార్యంగా పరిగణించబడక పోవచ్చు, ఉదాహరణకు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుముఅహ్) వదిలివేయడం, అల్లాహ్ మార్గంలో పోరాడుటకు వెళ్ళకుండా ఉండిపోవడం, లేదా షరియత్ అనుమతించే ఏ కారణం లేకుండా అతనిపై విధి చేయబడని (ఫర్జ్ కానటువంటి) ఏదైనా ఇతర చర్యను వదిలివేయడం; లేదా మిగతా సాధారణ సమయాలలో విధిగా ఆచరించ వలసిన ఆరాధనలను, “మీరు ఆచరించరాదు” అని షరియతే ఆదేశించడం, ఉదాహరణకు: ఋతుస్రావం స్థితిలో స్త్రీలు నమాజు మరియు ఉపవాసములు ఆచరించకుండా వదిలివేయడం.
الملاحظة
قال ابن حجر في قوله: "e;ما رأيت من ناقصات... إلخ"e; ويظهر لي أن ذلك من جملة أسباب كونهن أكثر أهل النار؛ لأنهن إذا كُنّ سببًا لإذهاب عقل الرجل الحازم حتى يفعل أو يقول ما لا ينبغي فقد شَارَكْنَه في الإثم وزِدْن عليه.
قوله ﷺ الله عليه وسلم:" أذهب للب الرجل الحازم منكن" أليس هذا مدح لمعشر النساء؟ لأن باستطاعتها ذهاب عقل الرجل الحازم.
النص المقترح البحث عن ما دونته للتأكد من صحته، و ﷺ
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా