కూర్పు:
+ -
عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:

«لاَ يُصَلِّي أَحَدُكُمْ فِي الثَّوْبِ الوَاحِدِ لَيْسَ عَلَى عَاتِقَيْهِ شَيْءٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 359]
المزيــد ...

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరూ మీ భుజాలపై ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒకే వస్త్రములో సలాహ్ (నమాజు) ఆచరించకండి”.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 359]

వివరణ

ఎవరైనా ఒకే వస్త్రం ధరించి భుజాలను, భుజము మరియు మెడ మధ్య భాగాన్ని, కప్పి ఉంచకుండా, బహిర్గతం చేస్తూ నమాజు ఆచరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. ఎందుకంటే భుజాలు “ఔరహ్”లో భాగం (ఔరహ్ అంటే శరీరములో అంటే తప్పనిసరిగా కప్పి ఉంచవలసిన ప్రైవేట్ శరీర భాగాలు) కానప్పటికీ, ఔరహ్ భాగాలను కప్పడంతో పాటు వాటిని కప్పడం కూడా సాధ్యమే. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు నిలబడి, సలాహ్ ఆచరిస్తున్నపుడు, ఆయన గౌరవానికి మరియు ఆయన ఘనతకు దగ్గరగా ఉంటుంది.

من فوائد الحديث

  1. తప్పనిసరిగా కప్పిఉంచవలసిన శారీర భాగాలను కప్పుతూ ఉన్నట్లయితే ఒకే వస్త్రములో నమాజు ఆచరించుట అనుమతించబడినదే.
  2. ఒక వస్త్రము నడుము నుండి పైభాగము కప్పుతూ ఉండి, మరొక వస్త్రము నడుము నుండి క్రింది భాగము కప్పుతూ ఉండేలా, రెండు వస్త్రములలో నమాజు ఆచరించుటకు అనుమతి ఉన్నది.
  3. నమాజు ఆచరించే వ్యక్తి (ఉన్నంతలో) మంచి దుస్తులు ధరించి, వీలైనంత ఆకర్షణీయమైన స్థితిలో ఉండేలా చూసుకోవడం అభిలషణీయము.
  4. వీలైతే నమాజు ఆచరించునపుడు రెండు భుజాలను లేదా వాటిలో ఒక దానిని కప్పుకోవడం తప్పనిసరి, అయితే, కొందరు ఉలెమాల అభిప్రాయం ప్రకారం భుజాలను ఆచ్ఛాదన లేకుండా వదిలి వేయడం ఖచ్చితంగా నిషేధించబడలేదు, నమాజు ఆచరిస్తున్నపుడు భుజాలను కప్పుకోవడం పరిశుద్ధతను సూచిస్తుంది.
  5. సహబాలు రజియల్లాహు అన్హుమ్ పేదవారు. కనీసం రెండు వస్త్రాలు కలిగి ఉండేంత ధనం కూడా వారి వద్ద ఉండేది కాదు.
  6. ఈ హదీథు యొక్క అర్థం గురించి వ్యాఖ్యానిస్తూ ఇమాం అన్’నవవి ఇలా అన్నారు: దీని వెనుక ఉన్న వివేకం ఏమిటంటే, అతడు తాను ధరించిన వస్త్రాన్ని తన భుజంపై ఏమీ లేకుండా కేవలం దిగువ వస్త్రంగా మాత్రమే ఉపయోగిస్తే, ఒక్కోసారి అది జారిపోయి అతని ‘ఔరహ్’ బయటపడవచ్చు; అయితే, అతను ఆ వస్త్రములో కొంత భాగాన్ని తన భుజంపై, భుజాలను కప్పిఉంచేలా ధరిస్తే ఇది జరగదు. అంతే కాకుండా, అతడు ఆ వస్త్రాన్ని నడుము నుండి క్రింది భాగపు ఆచ్ఛాదనగా (దిగువ వస్త్రంగా) ధరించిట్లయితే, అది జారి పోకుండా అతడు దానిని తన ఒక చేతితోనో లేక రెండు చేతులతోనో పట్టుకోవలసి రావచ్చు. అందువల్ల అతడు తన కుడి చేతిని, ఎడమచేతిపై ఉంచి, రెండు చేతులను ఛాతీ క్రింద గట్టిగా ఉంచుకోవడం, మరియు నమాజులో రెండు చేతులను పైకి లేపవలసిన సందర్భాలలో ఆ సున్నత్ ఆచరణలను కోల్పొయినవాడు అవుతాడు. పైగా మనిషిని మంచిగా కనిపించేలా చేసే శరీరపు పైభాగమైన అలంకరణ స్థలాన్ని, దుస్తులతో కప్పి ఉంచకుండా వదిలి వేసిన వాడవుతాడు. దివ్య ఖుర్’ఆన్ లో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: {ఓ ఆదం సంతతి వారలారా! మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి} [సూరత్ అల్-ఆఅ్'రాఫ్: 7:31]
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా