కూర్పు:
+ -
عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:

«لَا يَنْظُرُ اللهُ إِلَى رَجُلٍ أَتَى رَجُلًا أَوِ امْرَأَةً فِي دُبُرٍ».
[صحيح] - [رواه الترمذي والنسائي في الكبرى] - [السنن الكبرى للنسائي: 8952]
المزيــد ...

ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“పురుషునితో గానీ, లేక స్త్రీతో గానీ మలద్వారము ద్వారా సంభోగములో పాల్గొనే వాని వైపునకు అల్లాహ్ (తీర్పు దినమున) కన్నెత్తి కూడా చూడడు.”

[దృఢమైనది] - - [السنن الكبرى للنسائي - 8952]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడిని లేదా స్త్రీని మలద్వారము ద్వారా సంభోగించే వ్యక్తికి కలిగే తీవ్రమైన పరిణామాలను స్పష్టం చేశారు. ఎందుకంటే (తీర్పుదినమున) అల్లాహ్ అతనిపై తన అనుగ్రహం, దయ, కనికరం చూపడు. మరియు అది ఘోరమైన పాపాలలో (కబాయిర్’లలో) ఒకటి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తి చూపారు.

من فوائد الحديث

  1. పురుషుడు పురుషునితో సంభోగములో పాల్గొనడం (హోమోసేక్సువాలిటి (స్వలింగ సంపర్కము)) ఘోరమైన పాపములలో ఒకటి.
  2. అలాగే స్త్రీతో ఆమె మలద్వారముద్వారా సంభోగములో పాల్గొనడం కూడా ఘోరమైన పాపాలలో ఒకటి.
  3. అల్లాహ్ అతనిపైపు కన్నెత్తి కూడా చూడడు: అంటే దయ మరియు కరుణాపూరితమైన చూపు. అంతేకానీ అది ఇక్కడ సాధారణంగా “చూచుట” అని అర్థము కాదు. ఎందుకంటే సర్వోన్నతుడైన అల్లాహ్ నుండి ఏ విషయమూ దాగి లేదు, మరియు ఆయన చూపు నుండి ఏ విషయమూ మరుగుపడి లేదు.
  4. ఇవి మానవాళికి అత్యంత తీవ్రమైన మరియు ప్రమాదకరమైన అనైతిక ఆచరణలలో ఒకటి. ఎందుకంటే అవి సహజమైన మానవ స్వభావానికి విరుద్ధమైనవి, సంతానోత్పత్తిని తగ్గిస్తాయి, వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తాయి, ద్వేషం మరియు శత్రుత్వాన్ని పెంచుతాయి; మరియు అసహ్యకరమైన, వికారమైన జీవితాన్ని గడిపేలా చేస్తాయి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية الولوف الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా