قال رسول الله صلى الله عليه وسلم لأبي بكر وعمر: «هذان سَيِّدا كُهُول أهل الجنة من الأوَّلِين والآخِرين إلا النبيِّين والمرسلين».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 3664]
المزيــد ...
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 3664]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ యొక్క ప్రవక్తలూ మరియు సందేశహరుల తరువాత అబూబక్ర్ అస్సిద్దీఖ్ మరియు ఉమర్ అల్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ ప్రజలు అందరిలోకెల్లా ఉత్తములు, అలాగే స్వర్గములోనికి ప్రవేశించే వారందరిలోకెల్లా కూడా ఉత్తములు.