«إِذَا سَجَدْتَ، فَضَعْ كَفَّيْكَ وَارْفَعْ مِرْفَقَيْكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 494]
المزيــد ...
అల్ బరా ఇబ్న్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
(నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 494]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ చేయునపుడు సజ్దహ్ లో రెండు చేతుల యొక్క స్థానము ఏమిటో వివరిస్తున్నారు. అది – రెండు అరచేతులను, చేతి వ్రేళ్ళు (విడిగా, విప్పి ఉండేలా కాకుండా) కలిసి ఉండేలా మరియు ఖిబ్లా వైపునకు ఉండేలా చేయాలి. అదే సమయములో మోచేతులను (మోచేయి అంటే భుజపు టెముక మరియు ముంజేయి కలియు భాగము) నేలపై ఆనకుండా మోచేతులను శరీరానికి దూరంగా ఉండేలా, పైకి లేపి ఉంచి సజ్దహ్ చేయాలి.