قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ؟، قَالَ: «أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ، وَتَكْسُوَهَا إِذَا اكْتَسَيْتَ، أَوِ اكْتَسَبْتَ، وَلَا تَضْرِبِ الْوَجْهَ، وَلَا تُقَبِّحْ، وَلَا تَهْجُرْ إِلَّا فِي الْبَيْتِ»
[حسن] - [رواه أبو داود وابن ماجه وأحمد] - [سنن أبي داود: 2142]
المزيــد ...
ము’ఆవియా అల్ ఖుషైరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”
[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 2142]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించడం జరిగింది: ఒక భార్యకు తన భర్తపై ఉండే హక్కులు ఏమిటి అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా విషయాలు తెలిపినారు; వాటిలో ఇవి కొన్ని:
మొదటిది: ఆహారం విషయంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకండి. మీరు తిన్నపుడల్లా, లేక మీకు ఎవరైనా తినిపించినపుడల్లా ఆమెకు కూడా తినిపించండి.
రెండవది: దుస్తుల విషయంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకండి. మీరు దుస్తులు ధరించినపుడు (అంటే మీ కొరకు మీరు దుస్తులు కొన్నపుడు) ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయండి (ఆమె కొరకు కూడా దుస్తులు కొనండి), లేదా మీరు డబ్బు సంపాదించినపుడు, మీరు స్థోమత కలిగి ఉన్నపుడు మీతో పాటు ఆమెకూ దుస్తులు తీసుకోండి.
మూడవది: కారణం ఏమీ లేకుండా మరియు దండించవలసిన అవసరం ఏమీ లేకుండా ఆమెను ఎపుడూ దండించవద్దు. ఆమెను క్రమశిక్షణలో ఉంచడం కోసం, లేదా తప్పనిసరి విధులను నిర్లక్ష్యం చేసినందుకు ఆమెను దండించవలసి వస్తే, ఆమెను ఎపుడూ తీవ్రంగా దండించరాదు; మరియు ఆమె ముఖం పై ఎన్నడూ కొట్టరాదు. ఎందుకంటే శరీరంలో ముఖము అత్యంత ప్రముఖమైన భాగము, మరియు సౌందర్యవంతమైన రూపము కలిగి ఉండి, అత్యంత సున్నితమైన భాగములు కలిగినదై ఉంటుంది.
నాలుగవది: ఆమెను తిట్టవద్దు (శపించవద్దు), ఉదాహరణకు “అల్లాహ్ నీ ముఖాన్ని అందవికారంగా చేయుగాక” అనేలాంటి మాటలు అనవద్దు. ఆమెకు లేక ఆమె శరీరంలోని ఏ భాగానికీ అందవికారాన్ని ఆపాదించవద్దు, అందవికారము అంటే సౌందర్యానికి వ్యతిరేకము; ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మానవుని ముఖాన్ని మరియు శరీరాన్ని సృష్టించాడు మరియు ఆయన సృష్టించిన ప్రతిదానినీ పరిపూర్ణంగా చేశాడు; సృష్టిని నిందించడం అంటే సృష్టికర్తను నిందించినట్లే, అలాహ్ క్షమించుగాక.
ఐదవది: (దండించవలసి వస్తే) పడకలో తప్ప ఒకరినొకరు వదిలివేయకండి; మరియు ఆమె నుండి దూరంగా వెళ్లకండి; (శిక్షలో భారంగా) ఆమెను వేరే ఇంటికి మార్చకండి; భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినపుడు సాధారణంగా ఇలాగే జరుగుతుంది.