«كُنْ فِي الدُّنْيَا كَأَنَّكَ غَرِيبٌ أَوْ عَابِرُ سَبِيلٍ»، وَكَانَ ابْنُ عُمَرَ، يَقُولُ: إِذَا أَمْسَيْتَ فَلاَ تَنْتَظِرِ الصَّبَاحَ، وَإِذَا أَصْبَحْتَ فَلاَ تَنْتَظِرِ المَسَاءَ، وَخُذْ مِنْ صِحَّتِكَ لِمَرَضِكَ، وَمِنْ حَيَاتِكَ لِمَوْتِكَ.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6416]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా భుజాన్ని పట్టుకుని (ఒకసారి) నాతో ఇలా అన్నారు:
“ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”. ఇబ్న్ ఉమర్ ఇలా అంటూ ఉండేవారు: “సాయంత్రమైతే నీవు ఉదయం కొరకు వేచి చూడకు; మరియు ఉదయం అయితే సాయంత్రం కొరకు వేచి చూడకు. అనారోగ్య సమయంలో పనికి వచ్చేలా ఆరోగ్యం నుండి ఏదైనా గ్రహించు; మరణంలో పనికి వచ్చేలా (ఈ ప్రాపంచిక) జీవితం నుండి.”
ఈ హదీథులో ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ప్రస్తావించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భుజం – అంటే భుజంతో చేయి కలిపే భాగాన్ని- పట్టుకుని తనతో ఇలా అన్నారు: “ఉండడానికి ఇల్లు గానీ, లేదా ఆశ్రయమిచ్చి, తమతో పాటు ఉంచుకోవడానికి, తనకంటూ ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికి వచ్చిన అపరచితునిలా; సృష్టికర్త నుండి దూరం చేసే కారణాలలో ఒకటైన కుటుంబము, పిల్లలు మరియు బంధుత్వ సంబంధాలు లేని అపరిచితునిలా ఈ ప్రపంచంలో ఉండు. వాస్తవానికి పరాయి దేశానికి చేరుకున్న కొత్తవానిలా కాకుండా, తన మాతృభూమిని చేరుకోవాలని తపన పడే బాటసారిలా ఉండు. ఎందుకంటే పరాయి దేశానికి చేరుకున్న కొత్త వ్యక్తి అక్కడ స్థిరపడవచ్చు. కానీ తన మాతృదేశానికి మరలి పోవాలని ఆతృతపడే బాటసారి, ఆ పరాయి దేశాన్ని తేలికగా తీసుకుంటాడు, తను అక్కడే ఆగిపోకుండా తన తిరుగు ప్రయాణం పైననే పూర్తి ధ్యాస పెడతాడు. ఒక బాటసారి చివరికి తన మాతృదేశానికి చేరుకునే ప్రయాణంలో తనకు ఎంత అవసరమో అంత కంటే ఎక్కువ కావాలని కోరుకోడు. అలాగే ఒక విశ్వాసికి పరలోకంలో తన గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే, సహాయపడే దాని కంటే ఈ ప్రపంచంలో ఎక్కువ ఏమీ అవసరం లేదు.
ఇబ్న్ ఉమర్ ఈ ఉపదేశాన్ని అనుసరించేవారు. ఇంకా ఆయన ఇలా చెప్పేవారు: మీరు (ఉదయం) మేల్కొన్నట్లయితే, సాయంత్రం కోసం వేచి ఉండకండి, మరియు మీరు సాయంత్రం గడిపినట్లయితే, ఉదయం కోసం వేచి ఉండకండి మరియు సమాధులలోని వారి మధ్య మిమ్మల్ని మీరు సమాధిలో ఖననం చేయబడి ఉన్న వారిలా పరిగణించండి, ఎందుకంటే ఆరోగ్యం మరియు అనారోగ్యం లేకుండా జీవితం లేదు. కనుక ఆరోగ్యాన్ని అనుసరించి వచ్చే అనారోగ్యం వచ్చి పడి మిమ్మల్ని నిరోధించకముందే అల్లాహ్ యొక్క విధేయతలో సత్కార్యములు చేయుటకై త్వరపడండి; మరణానంతర జీవితంలో ప్రయోజనం కలిగించే ప్రతి దానిని చేస్తూ ఈ ప్రాపంచిక జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి.