«اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ، وَتَحَوُّلِ عَافِيَتِكَ، وَفُجَاءَةِ نِقْمَتِكَ، وَجَمِيعِ سَخَطِكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2739]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించినారు: “ఇది రసూలిల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆలలో ఒకటి:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక”
(ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2739]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాల నుండి అల్లాహ్ శరణు వేడుకున్నారు:
మొదటిది: (అల్లాహుమ్మ, ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక): ఓ అల్లాహ్! నా నుండి, ధార్మికపరమైన మరియు ప్రాపంచిక పరమైన నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి నీ శరణు వేడుకుంటున్నాను; ఇస్లాంలో స్థిరంగా ఉండడానికి, నీ ఆశీర్వాదాలను, నీ అనుగ్రహాలను దూరం చేసే పాపాలలో పడకుండ ఉండడానికి నిన్ను ఆశ్రయిస్తున్నాను.
రెండవది: (వతహవ్వులి ఆ’ఫియతిక): మరియు నీవు నాకు ప్రసాదించిన సౌఖ్యము, క్షేమము, విపత్తుగా మార్చి వేయబడకుండా నీ శరణు వేడుకుంటున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, కనుక ఓ అల్లాహ్! నిరంత శ్రేయస్సు కొరకు, బాధలు, కష్టాలు మరియు అనారోగ్యం నుండి భద్రత కొరకు నిన్ను వేడుకుంటున్నాను.
మూడవది: (వ ఫుజాఅతి నిఖ్’మతిక) మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చి పడే నీ ఆగ్రహం, నీ విపత్తు నుండి నేను నీ రక్షణ, నీ ఆశ్రయం కోరుతున్నాను. ఎందుకంటే హఠాత్తుగా వచ్చి పడే విపత్తు, జరిగిన తప్పుల నుండి, పాల్బడిన పాపపు పనుల నుండి పశ్చాత్తాప పడే సమయాన్ని లేదా వాటి నుండి కోలుకునే అవకాశాన్ని ఇవ్వదు. అది ఆ వ్యక్తికి కలిగించే కష్టము, బాధ, నష్టము అత్యంత గొప్పది, బాధాకరమైనది అయి ఉంటుంది.
నాలుగవది: (వ జమీఅ సఖతిక) మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, అంతేగాక నీ ఆగ్రహానికి కారణమయ్యే అన్ని విషయాల నుండి కూడా నీ శరణు వేడుకుంటున్నాను, ఎందుకంటే నీవు ఎవరి పట్ల ఆగ్రహించినావో వారు విఫలమయ్యారు మరియు ఓడిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఆగ్రహానికి సంబంధించి బహువచనాన్ని ఉపయోగించినారు “జమీఅ” (మొత్తంగా నీ ఆగ్రహం నుండి) అని. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యే అన్ని విషయాలు, అవి మాటలు గానీ, లేక ఆచరణలు గానీ, లేక అల్లాహ్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యే (అంధ) విశ్వాసాలు గానీ, మొత్తంగా, పూర్తిగా అందులో వస్తాయి.