ఉప కూర్పులు

హదీసుల జాబితా

1. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
2. “నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
3. “మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి (అని భావించాలి); అందుకు మీరు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి, ఆయన ఘనతను కొనియాడాలి మరియు ఇతరులకు తెలియజేయాలి. మరి ఒకవేళ మీకు వచ్చిన కలను మీరు ఇష్టపడనట్లయితే, అది షైతాను తరఫు నుంచి (అని భావించాలి), అందుకు మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దానిని ఇతరులకు తెలియజేయకూడదు. ఎందుకంటే అది మీకు ఎలాంటి హానీ కలుగజేయదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
4. “ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
5. “నేను ముస్లిములపై ఎక్కువ భారం వేస్తున్నానేమో అనే సందేహం లేకపోయినట్లయితే (జుబైర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇదే హదీసులో “....నా ఉమ్మత్’పై ఎక్కువ భారం వేస్తున్నానేమో” అనే పదాలు ఉన్నాయి) నిశ్చయంగా ప్రతి నమాజు సమయాన ‘సివాక్’ (పలుదోము పుల్ల) వాడమని ఆదేశించి ఉండేవాడిని.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
6. అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
7. “విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా గుర్తుంచుకోండి, (తీర్పు దినము నాడు) మీలో ఎవరూ కేవలం తన ఆచరణల ఆధారంగా రక్షించబడడు.” దానికి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! మీరు కూడానా?” దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును నేను కూడా, అల్లాహ్ తన కారుణ్యము మరియు అనుగ్రహముతో నన్ను కప్పివేస్తే తప్ప” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
8. “అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
9. “వినండి! మీకు స్వర్గవాసుల గురించి తెలియజేయనా? ప్రజలు తక్కువగా చూసే ప్రతి బలహీనమైన, పేద మరియు అంతగా ఎవరికీ తెలియని వ్యక్తి; అతడు గనుక అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఏదైనా అన్నట్లయితే, అల్లాహ్ దానిని నెరవేరుస్తాడు. వినండి! మీకు నరకవాసుల గురించి తెలియజేయనా? మదమెక్కిన ప్రతి క్రూరుడు, మూర్ఖుడు, పిసినారి మరియు గర్విష్టి నరకంలో ప్రవేశిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
10. “నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
11. “నిద్రలో మంచి దృశ్యాన్ని చూడడం అల్లాహ్ వైపు నుండి అయి ఉంటుంది; కనుక నిద్రలో మీరు భయపడే, లేదా భయం కలిగించే కల ఏదైనా చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి మరియు దాని కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు, రక్షణ కోరుకోవాలి; అపుడు అది అతనికి ఎలాంటి నష్టాన్నీ కలుగజేయదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
12. “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
13. నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
14. “నేను ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ఇలా ప్రశ్నించాను “ఇంటిలోనికి ప్రవేశిస్తూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఏమి చేసేవారు?” అని. దానికి ఆమె (ర) “వారు ముందుగా ‘సివాక్’ (పలుదోముపుల్ల) ఉపయోగించేవారు” అని సమాధానమిచ్చారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
15. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవిలో షైతాను మూత్రము పోసినాడు అనో అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
16. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
17. “అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
18. “మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
19. “నీవు (నాతో) చెప్పినట్లుగానే వారితో ఉన్నట్లయితే, నీవు వారికి వేడివేడి బూడిద తినిపిస్తున్న దానితో సమానం. నీవు వారితో ఈ విధంగానే (ప్రవర్తిస్తూ) ఉన్నంత కాలం వారికి వ్యతిరేకంగా అల్లాహ్ నుండి ఒక సహాయకుడు నీతో ఎప్పుడూ ఉంటాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
20. “అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
21. “ఏ సమావేశములోనైతే అల్లాహ్ నామస్మరణ జరుగదో, అటువంటి సమావేశము నుండి లేచిన ప్రజలు, వాస్తవానికి ఒక గాడిద శవము వద్ద నుండి లేచిన వారితో సమానము. అది వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
22. “తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించు వాడు మరియు తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించని వాడు – వీరిరువురి ఉదాహరణ జీవించి ఉన్న మరియు మరణించిన వానికి మధ్య ఉన్న పోలిక వంటిది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
23. “నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు దాని అలంకరణ” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
24. “ఎవరైతే తీర్పు దినము యొక్క శిక్షల నుండి అల్లాహ్ చేత రక్షించబడుటను ఇష్టపడతాడో, అతడు తన వద్ద అప్పు తీసుకుని, (వాస్తవంగా) దానిని తీర్చలేక పోతున్న వ్యక్తికి మరింత సమయం ఇవ్వడం ద్వారా లేదా ఇచ్చిన అప్పు నుండి కొంత తగ్గించడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
25. “నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
26. “తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
27. "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
28. “ముగ్గురి పైనుండి (మూడు రకాల వ్యక్తులపైనుండి) కలము లేపివేయబడినది (వారిని గురించి ఏమీ నమోదు చేయదు); వారు: నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుంచి మేల్కొనేంత వరకు; యుక్త వయస్సుకు చేరని బాలుడు/బాలిక అతడు యుక్తవయస్సుకు చేరేంతవరకు, మరియు మతిస్థిమితము కోల్పోయిన పిచ్చివాడు, అతడు తిరిగి మతిస్థిమితం పొందేంతవరకు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ