«مَنْ كَانَ لَهُ ذِبْحٌ يَذْبَحُهُ فَإِذَا أُهِلَّ هِلَالُ ذِي الْحِجَّةِ، فَلَا يَأْخُذَنَّ مِنْ شَعْرِهِ، وَلَا مِنْ أَظْفَارِهِ شَيْئًا حَتَّى يُضَحِّيَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1977]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర భార్య ఉమ్ముల్ ముమినీన్ ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు అతడు తన వెంట్రుకలు లేదా గోర్ల నుండి ఏదీ కత్తిరించకూడదు."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1977]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్బానీ చేయాలని సంకల్పం చేసుకున్న వారికి ఇలా ఆదేశించారు: "ఎవరైతే ఖుర్బానీ (ఉద్దియ్యా) చేయాలనుకుంటున్నారో, దుల్-హిజ్జహ్ నెలవంక కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు: తన తల వెంట్రుకల నుండి, చంకల క్రింద పెరిగే వెంట్రుకల నుండి, మీసం నుండి, శరీరంలోని ఇతర ప్రాంతాలలోని అంటే మర్మాంగాలు మొదలైన చోట పెరిగే వెంట్రుకల నుండి, చేతి/కాళ్ల గోర్ల నుండి ఏమీ తీయకూడదు."