కూర్పు:
+ -
عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:

أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ فِي سُجُودِهِ: «اللهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ، وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 483]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త ముహమ్మద్ ﷺ తన సజ్దాలో ఇలా ప్రార్థించేవారు: "అల్లాహ్‌మ్మగ్ఫిర్లీ దంబీ కుల్లహు;దిఖ్ఖహు వజిల్లహు; వ అవ్వలుహు, వ ఆఖిరహు; వ అలానియ్యతహు, వ సిర్రహు. (ఓ అల్లాహ్! నా మొత్తం పాపాలను క్షమించు — అవి చిన్నవైనా, పెద్దవైనా, మొదటివైనా, చివరివైనా, ప్రత్యక్షంగా చేసినవైనా, రహస్యంగా చేసినవైనా."

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 483]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సజ్దాలో దుఆ చేస్తూ ఇలా పలికేవారు: "(అల్లాహహుమ్మగ్ఫిర్లీ దంబీ) అంటే ఓ అల్లాహ్! నా పాపాలను క్షమించు" అని అర్థం: నా పాపాలను దాచిపెట్టు (ఈ ప్రపంచంలోనూ మరియు పరలోకంలోనూ), వాటి ప్రభావం నుండి నన్ను రక్షించు, వాటిని పూర్తిగా మాఫీ చేయి, నన్ను క్షమించు, నాపై దయ జూపు; (కుల్లహు) "అన్నీ" అంటే: చిన్నవి, తక్కువ సంఖ్యలో ఉన్నవి (దిక్కహ్ = చిన్నవి, తక్కువవి); పెద్దవి, ఎక్కువ సంఖ్యలో ఉన్నవి (వజిల్లహు = పెద్దవి, ఎక్కువవి); (أوله وآخره) మొదటి పాపం నుండి చివరి పాపం వరకు, మధ్యలో ఉన్నవన్నీ; (علانيته وسره) బహిరంగంగా జరిగినవి అయినా, రహస్యంగా జరిగినవి అయినా (ఎవరూ చూడని చోట) అవి నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు; నీవు పరమ పవిత్రుడవు.

من فوائد الحديث

  1. ఇబ్నుల్-ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: పాపాలు చిన్నవైనా మరియు పెద్దవైనా, తక్కువ ఉన్నా (దఖీక్) మరియు ఎక్కువ ఉన్నా (జలీల్), మొదటివైనా మరియు చివరివైనా, రహస్యమైనవైనా మరియు బహిరంగమైనవైనా - అన్ని పాపాలకు క్షమాపణ కోరడం (దుఆలో ఇలా సంపూర్ణంగా అడగడం) అంటే మనిషికి తెలిసిన పాపాలకే కాదు, అతడికి తెలియని పాపాలకు కూడా పశ్చాత్తాపం (తౌబా), క్షమాపణ వర్తించేటట్లు చేయడమే.
  2. చివరిగా ఇలా చెప్పబడింది: "దిఖ్ఖు" (చిన్న పాపాలు) అనే పదాన్ని "జిల్లు" (పెద్ద పాపాలు) కంటే ముందుగా చెప్పడానికి కారణం: దుఆలో అడుగుతున్నప్పుడు, మనం చిన్నవి నుండి పెద్దవి వరకు అడుగుతూ, స్థాయిని పెంచుతూ (తరచుగా) ప్రార్థన చేస్తాం. మరో ముఖ్యమైన విషయం: పెద్ద పాపాలు చాలా సార్లు చిన్న పాపాలను నిర్లక్ష్యం చేయడం, వాటిని పట్టించుకోక పోవడం వలననే జరుగుతాయి. అంటే, చిన్న పాపాలను తక్కువగా చూడటం వలననే, మనిషి పెద్ద పాపాల్లోకి వెళ్లిపోతాడు. అందుకే, వసీలా హక్కు ఏమిటంటే, ముందుగా చిన్న పాపాలను కూడా క్షమించమని అడగడం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే, చిన్న పాపాలు కూడా పెద్ద పాపాలకు దారి తీస్తాయి. అందుకే వాటిని ముందుగా ప్రస్తావించడం అవసరం.
  3. అల్లాహ్‌ వద్ద వినయవిధేయతలతో ప్రార్థించాలి, ఆయన వద్ద మన చిన్న–పెద్ద పాపాలన్నింటి కొరకు క్షమాపణ వేడుకోవాలి.
  4. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: ఈ హదీథు దుఆను బలంగా, పునరావృతంగా, వివిధ పదాలతో చేయడం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది — అందులో కొన్ని పదాలు ఇతర పదాలను కవర్ చేసినా కూడా, వివిధ పదాలతో, ఎక్కువగా, దృఢంగా దుఆ చేయడం మంచిదని తెలుస్తోంది.
الملاحظة
التضرع إلى الله تعالى، وطلبه المغفرة من جميع الذنوب، الصغائر والكبائر.
قننeudi,y
النص المقترح U, i
الملاحظة
التضرع إلى الله تعالى، وطلبه المغفرة من جميع الذنوب، الصغائر والكبائر.
قننeudi,y
النص المقترح U, i
الملاحظة
التضرع إلى الله تعالى، وطلبه المغفرة من جميع الذنوب، الصغائر والكبائر.
قننeudi,y
النص المقترح U, i
الملاحظة
التضرع إلى الله تعالى، وطلبه المغفرة من جميع الذنوب، الصغائر والكبائر.
قننeudi,y
النص المقترح U, i
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా