«لاَ يَقُلْ أَحَدُكُمْ: اللَّهُمَّ اغْفِرْ لِي إِنْ شِئْتَ، ارْحَمْنِي إِنْ شِئْتَ، ارْزُقْنِي إِنْ شِئْتَ، وَليَعْزِمْ مَسْأَلَتَهُ، إِنَّهُ يَفْعَلُ مَا يَشَاءُ، لاَ مُكْرِهَ لَهُ».
ولمسلم: «وَلَكِنْ لِيَعْزِمِ الْمَسْأَلَةَ وَلْيُعَظِّمِ الرَّغْبَةَ، فَإِنَّ اللهَ لَا يَتَعَاظَمُهُ شَيْءٌ أَعْطَاهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7477]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీలో ఎవ్వరూ ఇలా పలకవద్దు: ‘ఓ అల్లాహ్! నీ ఇష్టం ఉంటే నన్ను క్షమించు, నీకు ఇష్టం ఉంటే నా మీద కరుణ చూపు, నీకు ఇష్టం ఉంటే నాకు అన్నపానీయాలు (రిజ్క్) ఇవ్వు’ అని. బదులుగా, తన కోరికను కోరడంలో దృఢంగా అడగాలి. నిజంగా, అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు, ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు (ఆయన తన పని గురించి ఎవరితోనూ ఇబ్బంది పడడు)."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 7477]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు"తన దువాను ఏదైనా విషయానికి షరతుగా పెట్టి (అంటే: 'అల్లాహ్! నీవు ఇష్టపడితే నన్ను క్షమించు' అంటూ) అడగడం నుండి వారించారు— 'అల్లాహ్ యొక్క ఇష్టం ఉంటే' అనే పదాలతో సహా. ఎందుకంటే నిజానికి, నిశ్చయంగా అల్లాహ్ తన ఇష్టానికి అనుగుణంగా మాత్రమే క్షమిస్తాడు. కానీ ఇక్కడ “నీకు ఇష్టమైతే” అనే పదాన్ని వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విధమైన షరతులు (అంటే కండిషన్లు, ఒకవేళ అని అనే పదాలు) ఎవరికైనా ఏదైనా చేయడం తన చేతిలో ఉన్నా, వారు బలవంతంగా లేదా అక్కడికక్కడ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి. అల్లాహ్ అయితే అలాంటి వాటి నునండి ఎంతో పవిత్రుడు — ఆయనపై ఎవరూ ఎలాంటి ఒత్తిడీ లేదా బలవంతమూ చేయలేరు. ఇది హదీథు చివరలో స్పష్టం చేయబడింది. అలాగే: అల్లాహ్ ఏదైనా ఇవ్వదలిస్తే, అది ఆయనకు పెద్ద విషయం ఏమీ కాదు — ఆయన బలహీనుడు కాదు, అలసిపోయే వాడు కాదు, ఎందుకంటే ఆయనకు ఏదీ కష్టం కాదు. అందువల్ల “నీవు ఇష్టపడితే ఇవ్వు” అని చెప్పడం, ఒక విధంగా నీ అనుగ్రహం నాకు అవసరం లేదు అని చెప్పడమే అవుతుంది. ఉదాహరణకి, ఎప్పుడు మనం ఎవరితోనైనా “మీకు ఇష్టమైతే ఇది ఇవ్వండి” అని చెబుతాము? అతనికి అది అవసరం లేనప్పుడు, లేదా అతను ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు (బలహీనుడైతే) కదా. కానీ అల్లాహ్ అన్ని విషయాల్లో శక్తిశాలి – మనం ఆయనకు అత్యంత అవసరమైనవారు. కావున, దుఆను అనిగ్రహంగా, అవసరంతో, నిరుపాయం చేత్తో అడగాలి — గర్వాన్ని విడిచి పెట్టి, దృఢమైన నమ్మకంతో: “ఓ అల్లాహ్! నన్ను క్షమించు, ఓ అల్లాహ్! నాపై దయచూపు” అని పేదవాడిలా, అవసరమున్నవాడిలా అడగాలి. అల్లాహ్ అన్నిటి కన్నా స్వయం సంపూర్ణుడు. ఆయన అన్ని విషయాలలో శక్తివంతుడు!"
تعظيم الرغبة فيما عند الله وحسن الظن به سبحانه.ما معني جملة وليعظم الرغبة كما جاءت في حديث رسول الله صلى الله عليه وسلم