«مَا مِنْ مُسْلِمَيْنِ يَلْتَقِيَانِ فَيَتَصَافَحَانِ إِلَّا غُفِرَ لَهُمَا قَبْلَ أَنْ يَفْتَرِقَا».
[صحيح بمجموع طرقه] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 5212]
المزيــد ...
అల్ బరఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించినారు, ఇద్దరు ముస్లింలు రోడ్డు మీద లేదా వేరే ఇతర చోట కలుస్తే, వారిలో ఒకడు మరొకరిని సలాం తెలుపుతూ చేతులు కలిపితే, వారు విడిపోయేలోగా (తమ తమ మార్గాల్లో వెళ్ళేందుకు విడి పోయే లోగా లేదా తమ తమ చేతులు వెనక్కు తీసుకునే లోగా), ఉభయుల పాపాలు క్షమించబడతాయి.