కూర్పు:
+ -
عَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:

«الْعِبَادَةُ فِي الْهَرْجِ كَهِجْرَةٍ إِلَيَّ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2948]
المزيــد ...

మఅఖిల్ ఇబ్న్ యసార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
కలహాలు, అశాంతి సమయాలలో ఆరాధన చేయడం అంటే నాకు హిజ్రత్ (ధర్మం కోసం వలస) చేసినట్లుగా ఉంటుంది.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2948]

వివరణ

కలహాలు, గందరగోళం, పరస్పర హత్యలు ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఎవరు ఆరాధనలను పట్టుదలగా నిరంతరం కొనసాగిస్తూ ఉంటారో, వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద మక్కా విజయానికి ముందు హిజ్రత్ చేసినవారి స్థానం లభిస్తుంది. అశాంతి, ఫిత్నా (కలహాలు), హత్యలు, మరియు ప్రజల వ్యవహారాలు గందరగోళంగా ఉన్న కాలంలో ఆరాధనలో నిబద్ధంగా ఉండాలని, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సూచించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద అలాంటి సమయంలో కూడా ఆరాధన కొనసాగించినందుకు లభించే పుణ్యం, హిజ్రత్ (వలస) చేసిన వారి పుణ్యంతో సమానం. ఎందుకంటే, అటువంటి కష్టకాలంలో ప్రజలు ఆరాధనను మర్చిపోయి, ఇతర విషయాలలో మునిగి పోతారు, అతి కొద్దిమంది మాత్రమే ఆరాధనకు సమయం కేటాయిస్తారు.

من فوائد الحديث

  1. ఫిత్నా (కలహాలు, గందరగోళం) కాలంలో ఆరాధన చేయాలని, అల్లాహ్ వైపు మరింత దృష్టి కేంద్రీకరించాలని ప్రోత్సహించడం అనేది ఫిత్నాల నుంచి రక్షణగా పని చేస్తుంది. మరియు పాపం, వినాశం నుంచి కాపాడుకునేందుకు ఇది చాలా అవసరం.
  2. ఫిత్నా (కలహాలు, గందరగోళం) మరియు ప్రజలు నిర్లక్ష్యం చేసే సమయాలలో ఆరాధన చేయడంలోని గొప్ప మహత్యం ఇక్కడ వివరించబడింది.
  3. ఒక ముస్లిం కలహాలు, గందరగోళాలు మరియు నిర్లక్ష్యమైన పరిస్థితులకు దూరంగా ఉండాలి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా