కూర్పు:
+ -
عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا:

أَنَّ رِجَالًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أُرُوا لَيْلَةَ القَدْرِ فِي المَنَامِ فِي السَّبْعِ الأَوَاخِرِ، فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَرَى رُؤْيَاكُمْ قَدْ تَوَاطَأَتْ فِي السَّبْعِ الأَوَاخِرِ، فَمَنْ كَانَ مُتَحَرِّيهَا فَلْيَتَحَرَّهَا فِي السَّبْعِ الأَوَاخِرِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2015]
المزيــد ...

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది పురుషులకు, లైలతుల్ ఖదర్ (ఖదర్ రాత్రి) చివరి ఏడు రాత్రుల్లోనే ఉన్నట్లుగా వారి కలల్లో కనబడింది. దీనిపై రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీ కలలు చివరి ఏడు రాత్రులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, ఎవరైనా ఖదర్ రాత్రిని అన్వేషిస్తూ ఉంటే, వారు దానిని చివరి ఏడు రాత్రుల్లో అన్వేషించాలి."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2015]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది పురుషులకు, లైలతుల్ ఖదర్ రమదాన్ నెల చివరి ఏడు రాత్రుల్లో ఉందని కలలో చూపించబడింది. దీనిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ కలలు చివరి ఏడు రాత్రులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, ఎవరైనా ఖదర్ రాత్రిని వెతకాలని ఆశిస్తు ఉంటే, వారు దానిని చివరి ఏడు రాత్రుల్లో శ్రద్ధగా వెతకాలి." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రోత్సహించారు: ఖదర్ రాత్రి రమదాన్ చివరి పది రాత్రుల్లో, ప్రత్యేకంగా చివరి ఏడు రాత్రుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రమదాన్ నెల 30 రోజులు అయితే, చివరి ఏడు రాత్రులు 24వ రాత్రి నుంచి మొదలు అవుతాయి. ఒకవేళ రమదాన్ నెల 29 రోజులు అయితే, 23వ రాత్రి నుంచి మొదలవుతాయి. ఈ రాత్రుల్లో మంచి పనులు, అల్లాహ్ యొక్క దిక్ర్, దుఆలు మరింత ఎక్కువగా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించారు

من فوائد الحديث

  1. లైలతుల్ ఖదర్ (ఖదర్ రాత్రి) ఘనత తెలుసుకోవడం మరియు దానిని అన్వేషించడం గురించి ప్రోత్సహించబడింది.
  2. అల్లాహ్ తన వివేకం మరియు దయ వలన, లైలతుల్ ఖదర్ (ఖదర్ రాత్రి) ఖచ్చితంగా ఏ రాత్రో మనకు తెలియకుండా ఉంచాడు. దీని వలన ముస్లింలు ఆ రాత్రిని వెతుకుతూ, రమదాన్ చివరి పది రాత్రుల్లో మరింత శ్రద్ధగా ఆరాధనలు, నమాజులు చేస్తారు. దీని ఫలితంగా వారికి ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది.
  3. లైలతుల్ ఖదర్ (ఖదర్ రాత్రి) రమదాన్ చివరి పది రాత్రుల్లో ఉంటుంది, ప్రత్యేకంగా చివరి ఏడు రాత్రుల్లో ఉండే అవకాశం ఎక్కువ.
  4. లైలతుల్ ఖదర్ (ఖదర్ రాత్రి) రమదాన్ నెల చివరి పది రాత్రులలోని ఒక ఘనమైన రాత్రి. ఈ రాత్రే మహోన్నతుడైన అల్లాహ్ ఖుర్ఆన్‌ను తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వచనాల రూపంలో అవతరింపజేశాడు. ఈ రాత్రిలోని శుభాలు, అనుగ్రహాలు, ఘనతలు, మరియు ఈ రాత్రిలో చేసిన మంచి పనుల ప్రతిఫలం ఎంతో మహత్తరమైనది. ఈ రాత్రి యొక్క శుభాలు, దీవెనలు వెయ్యి నెలల కన్నా మెరుగ్గా ఉంటాయి.
  5. "ఖదర్ రాత్రి" అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రాత్రికి "ఖదర్" అనే పేరు రెండు ముఖ్యమైన కారణాల వల్ల వచ్చింది: 1. గౌరవం, ప్రతిష్ట : "ఖదర్" అనే పదం అరబిక్‌లో "గౌరవం", "ప్రతిష్ట", "స్థాయి" అనే అర్థాలను కలిగి ఉంది. ఎవరైనా గొప్ప స్థాయిలో ఉన్నవారిని "అతను గొప్ప ఖదర్ కలవాడు" అని అంటారు. అందువలన, "ఖదర్ రాత్రి" అంటే "గౌరవవంతమైన రాత్రి", "ప్రతిష్టాత్మకమైన రాత్రి" అని అర్థం. దీని గురించి ఖుర్ఆన్‌లోనూ ఇలా ఉంది: {మేము దాన్ని (ఖుర్ఆన్‌ను) దీవ్యమైన రాత్రిలో దించాము} (సూరహ్ అల్-దుఖాన్: 3); 2. విధి నిర్ణయం: "ఖదర్" అనే పదం "తక్దీర్" (విధి, నిర్ణయం) అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే, ఈ ఘనమైన రాత్రిలో వచ్చే ఏడాది జరిగే విషయాలన్నీ నిర్ణయించ బడతాయి. దీనికి ఖుర్ఆన్‌లోని ఆధారం: {ఆ రాత్రిలో ప్రతి జ్ఞానవంతమైన విషయం నిర్ణయించబడుతుంది} (సూరహ్ అల్-దుఖాన్: 4)
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా