«تَفْضُلُ صَلاَةُ الجَمِيعِ صَلاَةَ أَحَدِكُمْ وَحْدَهُ، بِخَمْسٍ وَعِشْرِينَ جُزْءًا، وَتَجْتَمِعُ مَلاَئِكَةُ اللَّيْلِ وَمَلاَئِكَةُ النَّهَارِ فِي صَلاَةِ الفَجْرِ» ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ: فَاقْرَءُوا إِنْ شِئْتُمْ: {إِنَّ قُرْآنَ الفَجْرِ كَانَ مَشْهُودًا} [الإسراء: 78].
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 648]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
"ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజు (జమాఅత్ తో ఆచరించే నమాజు) యొక్క ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు గొప్పది. రాత్రి సమయపు దేవదూతలు మరియు పగటి సమయపు దేవదూతలు ఫజ్ర్ నమాజు సమయంలో సమావేశమవుతారు.' "అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, "కావాలంటే మీరు పవిత్ర గ్రంథాన్ని పఠించండి, “ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా” (నిష్చయంగా తెల్లవారుజామున ఖురాన్ పారాయణం (ఫజ్ర్ ప్రార్థన) ఎల్లప్పుడూ వీక్షించబడుతుంది." (సూరహ్ అల్ ఇస్రా 17:78).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 648]
ఈ హదీథులో ఇమామ్‌తో కలిసి సామూహికంగా నమాజు ఆచరించే వ్యక్తికి లభించే ప్రతిఫలం మరియు బహుమానము అతడు ఇంట్లోనో లేదా మార్కెట్‌లోనో ఒంటరిగా ఆచరించే ఇరవై ఐదు నమాజుల కంటే గొప్పదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు. తరువాత ఆయన రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతలు ‘ఫజ్ర్’ నమాజు కోసం సమావేశమవుతారని ప్రస్తావించారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దీనికి ఆధారాలను ఉటంకిస్తూ ఇలా అన్నారు:
“కావాలంటే మీరు (ఖుర్’ఆన్) చదండి: {ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా}
(నిశ్చయంగా, ప్రాతఃకాల (ఖుర్‌ఆన్) పఠనం (దైవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది. [సూరా అల్ ఇస్రా: 17:78] అంటే దాని అర్థము ఫజ్ర్ నమాజు రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతల ద్వారా వీక్షించబడుతుంది అని.