కూర్పు:
+ -
عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ:

مَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُسْتَجْمِعًا قَطُّ ضَاحِكًا، حَتَّى أَرَى مِنْهُ لَهَوَاتِهِ، إِنَّمَا كَانَ يَتَبَسَّمُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6092]
المزيــد ...

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన:
“నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6092]

వివరణ

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ, తన ‘లహాత్’ – నోటిలో గొంతు పైభాగాన వ్రేళ్ళాడుతూ ఉన్నట్లు ఉండే మాంసపు తునక అంటే కొండనాలుక - కనిపించేటంత ఎక్కువగా నవ్వలేదు. ఆయన కేవలం చిరునవ్వు మాత్రం నవ్వేవారు.

الملاحظة
طيب ولكن شوي فيه بطأ حتى يفتح
النص المقترح لغة الأمهريه

من فوائد الحديث

  1. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంగా ఉన్నప్పుడు, మరియు ఏదైనా విషయం కారణంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషపడినపుడు తన ఆనందాన్ని లేదా ఉల్లాసాన్ని వ్యక్తీకరించేదుకు అతిగా నవ్వడం కంటే ఎక్కువగా చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.
  2. ఇమాం ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వును పూర్తిగా ఆస్వాదిస్తూ, అందులో మునిగిపోయే విధంగా, హృదయపూర్వకంగా నవ్వడం నేను ఎన్నడూ చూడలేదు”.
  3. అతిగా నవ్వడం, బిగ్గరగా, అట్టహాసంగా నవ్వడం ‘సాలిహీన్’ల (ధర్మనిష్టాపరుల) గుణలక్షణాలలో లేని విషయం.
  4. అపరిమితమైన నవ్వు అతని సోదరులలో అతని గౌరవాన్ని, మరియు ప్రతిష్ఠను తగ్గిస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية النيبالية Юрба الدرية الرومانية المجرية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా