కూర్పు:
+ -
عَن عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ:

«إِنَّ قُلُوبَ بَنِي آدَمَ كُلَّهَا بَيْنَ إِصْبَعَيْنِ مِنْ أَصَابِعِ الرَّحْمَنِ، كَقَلْبٍ وَاحِدٍ، يُصَرِّفُهُ حَيْثُ يَشَاءُ» ثُمَّ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «اللهُمَّ مُصَرِّفَ الْقُلُوبِ صَرِّفْ قُلُوبَنَا عَلَى طَاعَتِكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2654]
المزيــد ...

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకడం విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు.
నిశ్ఛయంగా ఆదము సంతానం (మానవుల) హృదయాలన్నీ ఆ దయామయుడి (అల్లాహ్) రెండు వేళ్ల మధ్యలో ఒకే ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు." తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫ్ అల్-ఖులూబ్ సర్రిఫ్ ఖులూబనా అలా తా’అతిక్ (ఓ అల్లాహ్! హృదయాలను తిప్పేవాడా, మా హృదయాలను నీ విధేయత వైపు మళ్లించు).

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2654]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలిపినారు: ఆదము సంతతి (మానవుల) హృదయాలన్నీ దయామయుడైన అర్రహ్మాన్ (అల్లాహ్) యొక్క రెండు వేళ్ల మధ్యలో ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు. ఆయన తలుచుకుంటే దానిని సత్యమార్గంపై నిలుపుతాడు; లేదా తప్పుదారిలో విడిచి పెట్టేస్తాడు. హృదయాలన్నింటినీ నడిపించడం ఆయనకు ఒక్క హృదయాన్ని నడిపించడమంత సులభం. ఏ ఒక్క పని కూడా మరో పనికి ఆయన వద్ద అడ్డు తగలదు." తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫల్-ఖులూబ్! (హృదయాలను తిప్పేవాడా!) కొన్నిసార్లు ఆజ్ఞాపాలన చేసేలా, కొన్నిసార్లు అవిధేయతకు పాల్బడేలా, కొన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకునేలా, మరికొన్నిసార్లు మరచిపోయేలా హృదయాలను తిప్పే నీవు, మా హృదయాలను నీ ఆజ్ఞపాలన వైపు మాత్రమే తిప్పు."

من فوائد الحديث

  1. ఖుద్రత్ (విధివ్రాత) నిరూపణ ఉంది. మరియు అల్లాహ్ తన దాసుల హృదయాలను వాటి మీద లిఖించబడిన ఖుద్రత్ ప్రకారం నడిపిస్తాడు.
  2. సత్యం మరియు సన్మార్గంపై స్థిరంగా ఉండేట్లు చేయమని ఒక ముస్లిం తన ప్రభువును నిరంతరం ప్రార్థించుకోవాలి.
  3. అల్లాహ్ పట్ల భయం మరియు ఆయన ఒక్కడి పట్ల మాత్రమే అనుబంధమేర్పరచుకోవటం,ఆయనకు ఎటువంటి భాగస్వామి లేడు.
  4. ఆల్-ఆజురీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "సత్యాన్ని అనుసరించేవారు (అహ్లుస్-సున్నా) కూడా, మహోన్నతుడైన అల్లాహ్ తనను తాను ఎలా వర్ణించుకున్నాడో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని ఎలా వర్ణించారో, సహాబాలు రదియల్లాహు అన్హుమ్ ఆయన్ని ఎలా వర్ణించారో - అదే విధంగా ఆయన్ని వర్ణిస్తారు. ఇదే తొలితరం విద్వాంసుల (సలఫ్) మార్గం, ఎవరు (సున్నత్) అనుసరించారో వారి మార్గము, కొత్తదనాలు (బిద్అత్) సృష్టించని వారి మార్గము."
الملاحظة
قال الآجري: إن أهل الحق يَصِفُوْن الله عز وجل بما وصف به نفسه عز وجل، وبما وصفه به رسوله صلى الله عليه وسلم، وبما وصفه به الصحابة رضي الله عنهم، وهذا مذهب العلماء ممن اتبع ولم يَبتدِع. انتهى. فأهل السنة يُثْبِتُوْن لله ما أثبته لنفسه من الأسماء والصفات من غير تحريف ولا تعطيل ولا تكييف ولا تمثيل، ويَنْفُون عن الله ما نفاه عن نفسه، ويَسكتون عما لم يَرِدْ به نفيٌ ولا إثبات، قال الله تعالى: (‌لَيْسَ ‌كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ).
لا حاجة لأبينها إذ لم يتجرأ أحد من السلف بأن قال أصبعان حقيقيان وإنما قالوا أصبعان لا نعلمهما. هذا وإن المنصفين يعلمون أن الخلف وإن أوّلوا المعنى بالقدرة والإرادة فهم: لم ينكروا أن له أصبعين لكن رفضوا أن يكون المعنى على ظاهره لقرينة منعت ذلك. لم يأتوا بمعنى مخالف لظاهر الحديث فهو يفيد قدرة الله وإرادته في عباده وهذا ما تأولوا معناه هذا وإن المخالفين لهم حتى وإن أثبتوا الأصبعين الحقيقيين الذين نعلمهما فإنهم لا مفرّ لهم من تأول المعنى
النص المقترح لا يوجد...
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా