أَنَّ نَاسًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالُوا لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا رَسُولَ اللهِ، ذَهَبَ أَهْلُ الدُّثُورِ بِالْأُجُورِ، يُصَلُّونَ كَمَا نُصَلِّي، وَيَصُومُونَ كَمَا نَصُومُ، وَيَتَصَدَّقُونَ بِفُضُولِ أَمْوَالِهِمْ، قَالَ: «أَوَلَيْسَ قَدْ جَعَلَ اللهُ لَكُمْ مَا تَصَّدَّقُونَ؟ إِنَّ بِكُلِّ تَسْبِيحَةٍ صَدَقَةً، وَكُلِّ تَكْبِيرَةٍ صَدَقَةً، وَكُلِّ تَحْمِيدَةٍ صَدَقَةً، وَكُلِّ تَهْلِيلَةٍ صَدَقَةً، وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ، وَنَهْيٌ عَنْ مُنْكَرٍ صَدَقَةٌ، وَفِي بُضْعِ أَحَدِكُمْ صَدَقَةٌ»، قَالُوا: يَا رَسُولَ اللهِ، أَيَأتِي أَحَدُنَا شَهْوَتَهُ وَيَكُونُ لَهُ فِيهَا أَجْرٌ؟ قَالَ: «أَرَأَيْتُمْ لَوْ وَضَعَهَا فِي حَرَامٍ أَكَانَ عَلَيْهِ فِيهَا وِزْرٌ؟ فَكَذَلِكَ إِذَا وَضَعَهَا فِي الْحَلَالِ كَانَ لَهُ أَجْرٌ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1006]
المزيــد ...
అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొంతమంది సహాబాలు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! ధనవంతులు ఎన్నో పుణ్యాలు సంపాదించేస్తున్నారు. వారు కూడా మేము చేస్తున్నట్లుగానే నమాజ్ చేస్తారు, మేము ఉన్నట్లుగానే ఉపవాసం ఉంటారు,
కానీ (మేము చేయలేని విధంగా) తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు." అప్పుడు ప్రవక్త ఇలా పలికినారు: "అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్‌హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి
దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి,
"ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?" అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతడు పాపం చేసినట్లుగా లెక్కించబడతాడని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1006]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని కొంతమంది పేదవారు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ‘‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ధనవంతులు అన్ని పుణ్యాలూ సంపాదించేసు కుంటున్నారు. వారు మేము చేసేలా నమాజ్ చేస్తారు, మేము ఉండేలా ఉపవాసం ఉంటారు, కానీ వారు తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు, కానీ మేము మాత్రం (బీదరికం వలన) దానం చేయలేము!’’ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా ఉత్సాహపరిచారు: ‘‘అల్లాహ్ మీకు కూడా దానం చేసే అవకాశాన్ని ఇవ్వలేదు అని అనుకుంటున్నారా? ప్రతిసారి ‘‘సుబహానల్లాహ్’’ (అల్లాహ్ పరమ పవిత్రుడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్లాహు అక్బర్’’ (అల్లాహ్ గొప్పవాడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్ హమ్దులిల్లాహ్’’ (అల్లాహ్‌కే సకల స్తుతులు) అనడం దానం, ప్రతిసారి ‘‘లా ఇలాహ ఇల్లల్లాహ్’’ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అనడం దానం. మంచి పనిని ప్రోత్సహించడం దానం, చెడు పనిని నిషేధించడం కూడా దానం. మీలో ఎవరైనా తన భార్యతో తన కోరిక తీర్చుకుంటే, దానికీ పుణ్యం లభిస్తుంది.’’ దానికి వారు ఆశ్చర్యపడి, ‘‘ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరైనా తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?’’ అని అడిగారు. దానికి ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు: ‘‘అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతనికి పాపం చుట్టుకుంటుందని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే, అతనికి పుణ్యం లభిస్తుంది.’’