«لاَ تَسُبُّوا الرِّيحَ، فَإِذَا رَأَيْتُمْ مَا تَكْرَهُونَ فَقُولُوا: اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ مِنْ خَيْرِ هَذِهِ الرِّيحِ وَخَيْرِ مَا فِيهَا وَخَيْرِ مَا أُمِرَتْ بِهِ، وَنَعُوذُ بِكَ مِنْ شَرِّ هَذِهِ الرِّيحِ وَشَرِّ مَا فِيهَا وَشَرِّ مَا أُمِرَتْ بِهِ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2252]
المزيــد ...
ఉబయ్యి బిన్ కఅబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము.
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 2252]
ప్రవక్త ﷺ గాలిని తిట్టకూడదనీ, శపించకూడదనీ వారించారు. ఎందుకంటే గాలి అనేది దానిని సృష్టించిన అల్లాహ్ తఆలా ఆజ్ఞకు లోబడిన ఒక సృష్టి. అది ప్రేమతో కూడిన (రహ్మత్) వర్షాన్ని తీసుకు రాగలదు, లేదంటే శిక్ష (అజాబ్) ను కూడా తీసుకు రాగలదు. గాలిని తిట్టడం అంటే – దాన్ని సృష్టించిన అల్లాహ్ ను తిట్టడమే, మరియు విధిపై (అల్లాహ్ నిర్ణయంపై) అసంతృప్తి చూపడమే అవుతుంది. దీనికి బదులుగా ప్రవక్త ﷺ మనలను ఇలా నేర్పించారు: గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకు రాబోయే మంచి కోసం, మరియు దానికి అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ వలన కలిగే మేలు కోసం — అల్లాహ్ ను వేడుకోవాలి, దుఆ చేయాలి. ఉదాహరణకు, వర్షాలు కురిసేలా చేయడం, పూల మధ్య పరాగసంపర్కం కలిగించడం, పొలాలకు జీవం తీసుకురావడం. అలాగే, ఆ గాలి ద్వారా కలిగే చెడు నుండి, ముప్పు నుండి, నష్టాల నుండి అల్లాహ్ వద్ద రక్షణ కోరాలి. ఉదాహరణకు, చెట్లు, పంటలు నాశనం కావడం, పశువులు మృత్యువాత పడటం, ఇల్లు, భవనాలు కూలిపోవడం మొదలైనవి. ఇలాంటి దుఆ దానిని మారుస్తుంది, మన మనసులోని అసంతృప్తిని అల్లాహ్ పై తౌహీద్ జ్ఞానం దూరం చేస్తుంది.