కూర్పు:
+ -
عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:

«لاَ يَنْظُرُ اللَّهُ إِلَى مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلاَءَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5783]
المزيــد ...

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఎవరైతే గర్వంతో (అహంకారంతో) తన వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడుస్తాడో, పరలోకంలో అల్లాహ్ అలాంటి వారి వైపు చూడడు.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5783]

వివరణ

ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారు: క్రింది వస్త్రాన్ని లేదా ఇజార్‌ను (దుస్తులు) కాళ్ల మడమలకు (కీళ్ళకు) దిగువగా, అహంకారం మరియు గర్వంతో (అభిమానంతో) జార విడవడం నుండి జాగ్రత్త పడాలి. ఎవరైతే అలా చేస్తారో, అలాంటి వారు తీర్పుదినం నాడు అల్లాహ్ యొక్క దయా దృష్టిని పొందే అర్హతను కోల్పోతారు. అంటే, అల్లాహ్ వారిని క్షమించడు, వారిపై దయ చూపడు.

من فوائد الحديث

  1. "సౌబ్" (దుస్తులు) అంటే: ఇది కేవలం ఒక రకమైన దుస్తులకే పరిమితం కాదు, నడుము దిగువ భాగాన్ని కప్పే అన్ని రకాల దుస్తులను సూచిస్తుంది. అంటే: పైజామా, సల్వార్ (ప్యాంటు) తౌబ్ (పంజాబీ, జుబ్బా లాంటి పొడవైన దుస్తులు), ఇజార్ (ధోతి, లుంగీ) మరియు నడుము దిగువ భాగాన్ని కప్పే ఇతర దుస్తులు.
  2. దుస్తులు కాళ్ల మడమలకు దిగువగా వేసుకోకూడదనే (అల్' ఇస్బాల్) నిషేధం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: అల్' ఇస్బాల్ (దుస్తులు కాళ్ల మడమలకు దిగువ వరకు వేసుకోవడం)ను మహిళలకు అనుమతించడంలో ఉలమాలు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ ﷺ స్త్రీలకు తమ దుస్తుల చివరలను ఒక ముట్టు (దాదాపు ఒక అడుగు) వరకూ దిగువగా వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
  3. ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ వ్యాఖ్యానం: ప్రవక్త ﷺ యొక్క సాధారణ హదీథుల ప్రకారం అల్' ఇస్బాల్ (దుస్తులు మడమలకు దిగువగా వేసుకోవడం) పురుషుల కొరకు హరాం (నిషిద్ధం). అహంకారం (గర్వం)తో ఇలా చేస్తే, పాపం మరింత ఎక్కువ, శిక్ష కూడా తీవ్రమైనది అవుతుంది. అహంకారం లేకుండా చేసినా, అది కూడా నిషిద్ధమే; కానీ శిక్షలో తేడా ఉంటుంది.
  4. ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) అన్నారు: "స్త్రీ శరీరం మొత్తం ఔర (మర్మ భాగం), కాబట్టి ఆమె తన దుస్తుల చివరను (లెహంగా, బుర్ఖా, జిల్బాబ్ మొదలైనవి) ఒక షిబ్ర్ (సుమారు 20 సెంటీమీటర్లు) దిగువగా వేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అది సరిపోకపోతే, ఆమెకు అవసరాన్ని బట్టి, ఒక దొరా (సుమారు 45 సెంటీమీటర్లు) దిగువగా కూడా వేసుకోవచ్చు, కాళ్ల మడమల నుండి మొదలుపెట్టి."
  5. అల్-ఖాది ఇలా చెప్పినారు: పండితుల అభిప్రాయం ఏమిటంటే: సాధారణంగా, దుస్తుల్లో అవసరానికి మించి లేదా సాధారణంగా ఉపయోగించే పరిమితికి మించి ఎంతైనా పొడవుగా లేదా వెడల్పుగా వేసుకోవడం మంచిది కాదు (మక్రూహ్). అల్లాహ్ యే బాగా ఎరుగును.
  6. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: దుస్తుల పొడవులో ఉత్తమమైన పరిమితి: కమీసు (షర్ట్), ఇజార్ (ప్యాంటు, లుంగీ, పైజామా) చివర భాగం మోకాలు నుండి కాలిపిక్కల వరకు ఉండడం అత్యుత్తమం (ముస్తహబ్); అనుమతించ బడిన పరిమితి: కాలుకు మధ్య భాగం నుంచి మడమ (కాళ్ల కీళ్ళు) వరకు వస్త్రం ఉండడం అనుమతించబడింది, దీనిలో పాపం లేదు; నిషేధించబడిన పరిమితి: మడమలకు కింద వస్త్రం పడితే, ఇది నిషేధించబడింది (హరాం), హదీథులో "అది నరకంలోకి" అనే హెచ్చరిక ఉంది.
  7. ఇబ్నె ఉథైమీన్ (రహిమహుల్లాహ్) ఈ హదీథులోని "الله لا ينظر إليه" (అల్లాహ్ అతనిని చూడడు) అనే పదబంధాన్ని ఇలా వివరించారు: ఇక్కడ "చూడడం" అంటే, అల్లాహ్ యొక్క దయ, కరుణతో చూడడం (నజర్ రహ్మా వ రఅఫా) అని అర్థం. ఇది సాధారణంగా అల్లాహ్ అన్నింటినీ చూస్తాడు అనే అర్థం కాదు. ఎందుకంటే, అల్లాహ్‌ ముందు ఏదీ దాచబడదు, ఏదీ ఆయన దృష్టికి ఆవల ఉండదు. ఇక్కడ ఉద్దేశం: అల్లాహ్ తీర్పుదినం నాడు దయతో, కరుణతో చూడడు — అంటే, క్షమించడు, కరుణ చూపడు అని అర్థము.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الهولندية الغوجاراتية الرومانية المجرية الموري Канада الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా