కూర్పు:
+ -
عَنْ سَلْمَانَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:

«إِنَّ رَبَّكُمْ حَيِيٌّ كَرِيمٌ، يَسْتَحْيِي مِنْ عَبْدِهِ إِذَا رَفَعَ يَدَيْهِ إِلَيْهِ أَنْ يَرُدَّهُمَا صِفْرًا».
[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه] - [سنن أبي داود: 1488]
المزيــد ...

సల్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
నిశ్చయంగా మీ ప్రభువు బిడియపరుడు, ఉదారుడు. తన దాసుడు తన వైపు చేతులెత్తి అర్థించినప్పుడు, ఆయన వాటిని ఖాళీగా వాపసు చేయడానికి బిడియ పడతాడు.

[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 1488]

వివరణ

ప్రవక్త ముహమ్మద్ ﷺ మనం దుఆ (ప్రార్థన) చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తాలని ప్రోత్సహించారు. పరమ పవిత్రుడైన అల్లాహ్ చాలా సిగ్గు గలవాడు అంటే బిడియపడేవాడు (హయీ), ఆయన తన దాసులకు ప్రసాదించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు, దాసుడికి ఆనందం కలిగించే దానిని అతడికి ప్రసాదిస్తాడు, అతడి కొరకు హానికరమైన దానిని అతడికి దూరంగా ఉంచుతాడు. అల్లాహ్ చాలా దయగలవాడు (కరీమ్), ఆయన అడగకపోయినా ఇస్తాడు, అయితే అడిగినప్పుడు మరింత అధికంగా ఇస్తాడు! అల్లాహ్ తనను విశ్వసించే దాసుడు దుఆ కోసం చేతులు పైకి ఎత్తినప్పుడు, ఆ చేతులను ఖాళీగా, నిరాశతో వాపసు చేయడాన్ని సిగ్గుగా భావిస్తాడు.

من فوائد الحديث

  1. మనిషి అల్లాహ్‌ కు ఆయన అవసరం, దాస్యభావాన్ని ఎంత ఎక్కువగా చూపిస్తే, అతడి దుఆలు అల్లాహ్‌ వద్దకు చేరే అవకాశమూ, అవి నెరవేరే అవకాశమూ అంత ఎక్కువగా ఉంటాయి.
  2. ఇస్లాం ధర్మంలో దుఆ చేయమని ప్రోత్సహించబడింది. దుఆ చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తడం సున్నతు (ప్రవక్త ﷺ విధానం)గా పరిగణించబడింది. ఇది దుఆ ఆమోదించబడే ముఖ్యమైన కారణాలలో ఒకటిగా మరే అవకాశం ఉన్నది.
  3. ఇది అల్లాహ్ యొక్క ఉదారత (దయ, కరుణ) మరియు ఆయన దాసులపై ఆయన కరుణ ఎంత విస్తృతమైనదో వివరిస్తున్నది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా