«رَغِمَ أَنْفُ رَجُلٍ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ دَخَلَ عَلَيْهِ رَمَضَانُ ثُمَّ انْسَلَخَ قَبْلَ أَنْ يُغْفَرَ لَهُ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ أَدْرَكَ عِنْدَهُ أَبَوَاهُ الكِبَرَ فَلَمْ يُدْخِلاَهُ الجَنَّةَ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 3545]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!
[ప్రామాణికమైన హదీథు] - [అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ అత్తిర్మిదీ - 3545]
పరాభవం, అవమానం, నష్టానికి గురయ్యే మూడు రకాల వ్యక్తులకు వ్యతిరేకంగా వారి ముక్కు మట్టి కొట్టుకు పోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసినారు (అంటే అవమానించబడుగాక). మొదటి రకం వ్యక్తి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తన సమక్షంలో ప్రస్తావించబడినప్పుడు, అతడు ఆయనపై దరూద్ పంపని వాడు అంటే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని అయినా పలకని వాడు. రెండవ రకం వ్యక్తి: రమదాన్ నెలను పొంది, ఆపై అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం రమదాన్ మాసంలోని ప్రత్యేక ఆరాధనలలో పాల్గొనడం ద్వారా అల్లాహ్ యొక్క క్షమాపణ పొందే అవకాశం ఉన్నా, దాని సద్వినియోగం చేసుకోకుండానే ఆ నెలను పోగొట్టుకున్న వ్యక్తి. మూడవ రకం వ్యక్తి: తన తల్లిదండ్రులు వృద్ధాప్యాన్ని చేరుకున్నప్పటికీ, అతను వారి హక్కులను సరిగ్గా పూర్తి చేయకుండా, వారికి అవిధేయత చూపినందున మరియు వారిని ఉపేక్షించినందున, వారు స్వర్గంలో ప్రవేశింపజేయలేకపోయిన వ్యక్తి.