కూర్పు:
+ -
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:

«إِنَّ أَحَدَكُمْ إِذَا مَاتَ عُرِضَ عَلَيْهِ مَقْعَدُهُ بِالْغَدَاةِ وَالعَشِيِّ، إِنْ كَانَ مِنْ أَهْلِ الجَنَّةِ فَمِنْ أَهْلِ الجَنَّةِ، وَإِنْ كَانَ مِنْ أَهْلِ النَّارِ فَمِنْ أَهْلِ النَّارِ، فَيُقَالُ: هَذَا مَقْعَدُكَ حَتَّى يَبْعَثَكَ اللَّهُ يَوْمَ القِيَامَةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1379]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"నిశ్చయంగా, మీలో ఒకరు మరణించినప్పుడు, అతనికి ఉదయం మరియు సాయంత్రం అతని స్థానం చూపబడుతుంది. అతను స్వర్గవాసులలో ఉంటే, అతనికి స్వర్గంలో అతని స్థానం చూపబడుతుంది, మరియు అతను నరకవాసులలో ఉంటే, అతనికి నరకంలో అతని స్థానం చూపబడుతుంది. అతనితో ఇలా అనబడుతుంది: అల్లాహ్ తీర్పు రోజున మిమ్మల్ని పునరుత్థానం చేసే వరకు ఇది మీ స్థానం."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1379]

వివరణ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక దాసుడు మరణించినప్పుడు, రోజు ప్రారంభంలో మరియు చివరిలో అతని నివాస స్థలం మరియు స్వర్గం లేదా నరకంలో అతని నిర్దిష్ట స్థానం అతనికి చూపబడుతుంది - అతను స్వర్గవాసులలో ఉంటే స్వర్గంలో అతని స్థానం, మరియు అతను నరకవాసులలో ఉంటే నరకంలో అతని స్థానం. మరియు అతనికి ఇలా చెప్పబడుతుంది: పునరుత్థాన దినాన మీరు తిరిగి లేపబడే మీ స్థానం ఇదే. ఇది విశ్వాసికి సంత్వనము, సౌఖ్యము నిస్తుంది మరియు అవిశ్వాసికి శిక్షగా ఉంటుంది.

من فوائد الحديث

  1. సమాధిలో సాంత్వనము, సౌఖ్యము లేదా శిక్ష ఉంటుంది అనే విషయము సత్యము.
  2. ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ వివరణ భయభక్తులు కలిగిన విశ్వాసికి (ముత్తఖీ అయిన విశ్వాసికి) మరియు అవిశ్వాసికి స్పష్టంగా ఉన్నది. అలా కాక పాపపు పనులకు పాల్బడే విశ్వాసికి, స్వర్గంలో అతని స్థానం చూపించబడే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే చివరికి అతను అక్కడికే చేరుకుంటాడు కనుక.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా