ఉప కూర్పులు

హదీసుల జాబితా

1. “నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం చేసింది చాలా ప్రశ్నలు అడగడమే మరియు తమ ప్రవక్తలతో విభేదించడమే
عربي ఇంగ్లీషు ఉర్దూ
2. “సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
3. “సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
4. “పునరుథ్థాన దినమున నరకాగ్నిలో అందరికంటే తక్కువ శిక్ష విధించబడిన వ్యక్తితో అల్లాహ్ ఇలా అంటాడు: “నీ వద్ద భూమిపై ఉన్న ప్రతి వస్తువూ ఉన్నట్లైతే, వాటన్నింటినీ ఈ శిక్ష నుండి విముక్తి పొందుట కొరకు చెల్లించుకుంటావా?” అని. దానికి అతడు “అవును, చెల్లించుకుంటాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
5. “ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
6. “పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించకండి, వెండి లేక బంగారపు పాత్రలలో నీళ్ళు త్రాగకండి, మరియు వాటితో చేసిన పళ్ళాలలో తినకండి; ఎందుకంటే (ఈ ప్రాపంచిక జీవితంలో) అవి వారి కొరకు (అవిశ్వాసుల కొరకు); మన కొరకు పరలోక జీవితంలో ఉన్నాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
7. “వాస్తవానికి మిమ్ములను నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; కానీ జీబ్రయీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చారు, దైవదూతల ముందు అల్లాహ్ మిమ్మల్ని గురించి గర్విస్తున్నాడు” అని తెలియజేశారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
8. “మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్ యొక్క (నమాజు యొక్క) పరిపూర్ణతలో భాగము.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
9. “ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
10. “మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
11. “మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
12. “నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
13. ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి
عربي ఇంగ్లీషు ఉర్దూ
14. “దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
15. “ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
16. “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
17. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఆచరించునపుడు (సజ్దాలో) తన రెండు చేతులను (నేలపై) తన శరీరపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచేవారు, ఎంతగా అంటే వారి చంకల తెల్లదనము కనిపించేది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
18. “మనిషి ఖర్చు చేసే దీనార్లలో ఉత్తమమైన దీనార్ ఏది అంటే అతడు తన కుటుంబము పై ఖర్చు చేసినది; తరువాత అల్లాహ్ మార్గములో తన పశువులపై ఖర్చు చేసే దీనార్; తరువాత అల్లాహ్ మార్గములో తన సహచరులపై ఖర్చు చేసే దీనార్
عربي ఇంగ్లీషు ఉర్దూ
19. “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
20. “జనాబత్” గుస్ల్ యొక్క విధానము:
عربي ఇంగ్లీషు ఉర్దూ
21. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
22. “మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా అనుసరిస్తారు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
23. “(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
24. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
25. “ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ శిక్ష విధిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
26. “నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు? - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
27. “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది
عربي ఇంగ్లీషు ఉర్దూ
28. “అతను సత్యవంతుడైతే అతను విజయం సాధిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
29. “సూర్యుడు ఉదయించే దినములలో ఉత్తమమైన దినము ‘శుక్రవారము’
عربي ఇంగ్లీషు ఉర్దూ
30. “వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
31. ‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
32. “అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
33. “ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
34. “(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
35. “నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
36. “మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
37. “మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
38. “శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం
عربي ఇంగ్లీషు ఉర్దూ
39. “ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
40. “ఎవరైతే శుక్రవారమునాడు పరిపూర్ణంగా ఉదూ చేసుకుని, శుక్రవారపు నమాజుకు వెళ్ళి, ఇమాం యొక్క ప్రసంగాన్ని శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) మౌనంగా ఉంటాడో, ఆ శుక్రవారానికీ మరియు రాబోయే శుక్రవారానికీ మధ్య అతని వలన జరిగే చిన్న చిన్న పాపాలన్నీ క్షమించివేయబడతాయి; అంతేకాకుండా దానికి మరో మూడు దినములు అదనంగా కలుపబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
41. “ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
42. “ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
43. ’నిశ్చయంగా ధర్మము సులభమైనది’ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి,ధర్మానికి దగ్గరగా ఉండండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
44. “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
45. “నువ్వు కోరిన దానికంటే మంచి దాని వైపునకు నేను మార్గదర్శకం చేయనా? మీరు రాత్రి పడుకునేటపుడు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, “అల్’హందులిల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, మరియు “అల్లాహు అక్బర్” అని ముఫ్ఫై నాలుగు సార్లు ఉచ్ఛరించండి. అది (ఇంటిలో) ఒక సేవకుడిని కలిగి ఉండడం కంటే మేలైనది, శుభప్రదమైనది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
46. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి
عربي ఇంగ్లీషు ఉర్దూ
47. “ఎవరైతే “అల్’లాత్” మరియు “అల్’ఉజ్జా” ల సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తాడో, అతడు మరలా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. ఎవరైతే తన సహచరునితో “రా, నీతో జూదమాడనివ్వు” అని ఆహ్వానిస్తాడో, అతడు దానధర్మాలు చేయాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
48. “మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో? - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
49. “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
50. “నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
51. “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్”
عربي ఇంగ్లీషు ఉర్దూ
52. “పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?
عربي ఇంగ్లీషు ఉర్దూ
53. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు. ఉదూ కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో చేసేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
54. “ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది) - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
55. “కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
56. “మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
57. “నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
58. (నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
59. “ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై ప్రాకుతూ రావల్సి వచ్చినా మీరు వాటి కొరకు (మస్జిదుకు) వస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
60. “నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
61. “రమజాన్ మాసం వచ్చినపుడు ఉమ్రా చేయి. ఎందుకంటే ఆ మాసములో చేయు ఉమ్రా (పుణ్యఫలములో) హజ్జ్ తో సమానము” అన్నారు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
62. “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”
عربي ఇంగ్లీషు ఉర్దూ
63. “(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు,
عربي ఇంగ్లీషు ఉర్దూ