سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى: يَا ابْنَ آدَمَ إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ، وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيْئًا لأَتَيْتُكَ بِقُرَابِهَا مَغْفِرَةً».
[حسن] - [رواه الترمذي] - [سنن الترمذي: 3540]
المزيــد ...
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్
ప్రకటన: “ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీ పాపాలు ఆకాశపు మేఘాలను చేరేటంత ఎక్కువగా ఉన్నా, అపుడు నీవు నన్ను క్షమించమని వేడుకుంటే, నేను నిన్ను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీవు భూమి అంత పెద్ద పెద్ద పాపాలతో నావద్దకు వచ్చినా, నాకు సమానంగా ఎవరినీ భాగస్వామిగా చేయకుండా నన్ను కలుసుకుంటే నేను అంతకంటే గొప్ప క్షమాపణతో నీ వద్దకు వస్తాను.”
[ప్రామాణికమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 3540]
సకల శుభాల యజమాని, సర్వోన్నతుడు అయిన అల్లాహ్, హదీథ్ అల్ ఖుద్సీ లో ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు: ‘ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుంటూ, నా దయ మరియు కరుణను ఆశిస్తూ, నిరాశ చెందకుండా ఉన్నంత కాలం, నేను నీ పాపాలను కప్పివేస్తాను, వాటిని తుడిచి వేస్తాను, మరియు దానిని పట్టించుకోను, ఈ పాపాలు మరియు అవిధేయత పెద్ద పాపాలలో (కబాఇర్ లలో) ఒకటి అయినప్పటికీ, "ఓ ఆదమ్ కుమారుడా! నీ పాపాలు ఆకాశాలకు భూమికి మధ్య ఉన్న అంతరాన్ని నింపేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; దాని చివరలను మరియు దాని వివిధ భాగాలను కప్పివేసేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; నీవు క్షమించమని నన్ను వేడుకుంటే, నేను వాటినన్నింటినీ చెరిపివేస్తాను మరియు నీ కొరకు వాటన్నింటినీ క్షమిస్తాను, అవి సంఖ్యలో ఎంత ఎక్కువగా ఉన్నా పట్టించుకోను.”
ఓ ఆదము కుమారుడా! నీవు మరణానంతరం భూమి మొత్తం నిండి పోయేవన్ని పాపాలు మరియు అతిక్రమణలతో నా దగ్గరకు వచ్చినా; నీవు నాతో “షిర్క్” నకు పాల్బడకుండా (దేనినీ నాకు సమానంగా, నాకు సాటిగా, భాగస్వామిగా నిలబెట్టకుండా) “మువహ్హిద్”గా (ఏకదైవారాధనవాదిగా) మరణించినట్లయితే, నేను మొత్తం భూమిని నింపివేసేటంత క్షమాపణతో ఈ పాపాలు మరియు అతిక్రమణలను కలుసుకుంటాను; ఎందుకంటే నేను క్షమాపణలో అత్యంత విస్తృతమైన వాడిని మరియు “షిర్క్”ను తప్ప (బహుదైవారాధన తప్ప) అన్ని పాపాలను క్షమిస్తాను.
الذنوب ثلاثة أنواع: الأول: الشرك بالله؛ وهذا لا يغفره الله، قال الله عز وجل: {إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة}، الثاني: ظلم العبد نفسه فيما بينه وبين ربه من ذنوب ومعاصي؛ فإن الله عز وجل يغفر ذلك، ويتجاوز إن شاء، الثالث: ذنوب لا يترك الله منها شيئًا؛ وهي ظلم العباد بعضهم بعضًا، فلا بد من القصاص.لاشيء