أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَرْفَعُ يَدَيْهِ حَذْوَ مَنْكِبَيْهِ إِذَا افْتَتَحَ الصَّلَاةَ، وَإِذَا كَبَّرَ لِلرُّكُوعِ، وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ، رَفَعَهُمَا كَذَلِكَ أَيْضًا، وَقَالَ: «سَمِعَ اللَّهُ لِمَنْ حَمِدَهُ، رَبَّنَا وَلَكَ الحَمْدُ»، وَكَانَ لاَ يَفْعَلُ ذَلِكَ فِي السُّجُودِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 735]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు; రుకూ కొరకు ‘అల్లాహు అక్బర్’ అని పలుకునపుడు మరియు రుకూ నుండి తల పైకి ఎత్తునపుడు అదే విధంగా పైకి ఎత్తేవారు. అపుడు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హంద్” అని పలికారు. అయితే సజ్దహ్’లో అలా చేసేవారు కాదు (చేతులను పైకి ఎత్తేవారు కాదు).”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 735]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో మూడు చోట్ల తన రెండు చేతులను, భుజాల వరకు లేదా భుజాలకు ముందు వాటికి సమాంతరంగా, పైకి ఎత్తేవారు. భుజము అంటే భుజపు టెముక మరియు దండ ఎముక రెండు కలిసే స్థలము.
మొదటి చోటు: నమాజు ప్రారంభించుటకు ముందు “అల్లాహు అక్బర్” (తక్బీరతుల్ ఇహ్రాం) అని పలుకునపుడు.
రెండవది: రుకూ కొరకు “అల్లాహు అక్బర్” అని పలుకునపుడు.
మూడవది: రుకూ స్థితి నుండి తలపైకి ఎత్తుతూ “సమి’అల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్” అని పలికినపుడు.
అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దహ్ చేయుటకు ముందు కానీ, లేక సజ్దహ్ స్థితి నుండి తల పైకి ఎత్తునపుడు కానీ తన చేతులను పైకి ఎత్తలేదు.