కూర్పు:
+ -
عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه قَالَ: كَانَتْ عَلَيْنَا رِعَايَةُ الْإِبِلِ فَجَاءَتْ نَوْبَتِي فَرَوَّحْتُهَا بِعَشِيٍّ فَأَدْرَكْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَائِمًا يُحَدِّثُ النَّاسَ فَأَدْرَكْتُ مِنْ قَوْلِهِ:

«مَا مِنْ مُسْلِمٍ يَتَوَضَّأُ فَيُحْسِنُ وُضُوءَهُ، ثُمَّ يَقُومُ فَيُصَلِّي رَكْعَتَيْنِ، مُقْبِلٌ عَلَيْهِمَا بِقَلْبِهِ وَوَجْهِهِ، إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ» قَالَ فَقُلْتُ: مَا أَجْوَدَ هَذِهِ، فَإِذَا قَائِلٌ بَيْنَ يَدَيَّ يَقُولُ: الَّتِي قَبْلَهَا أَجْوَدُ، فَنَظَرْتُ فَإِذَا عُمَرُ قَالَ: إِنِّي قَدْ رَأَيْتُكَ جِئْتَ آنِفًا، قَالَ: «مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُبْلِغُ - أَوْ فَيُسْبِغُ - الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُ اللهِ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 234]
المزيــد ...

ఉఖ్’బా ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మాకు ఒంటెలను మేపుకు వచ్చే పని ఇవ్వబడింది. నా వంతు వచ్చినపుడు నేను వాటిని ఆరుబయట బయళ్లలో మేపుకుని సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాటల నుండి నేను ఇది గ్రహించాను:
“ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది).” అది విని నేను “ఆహా! ఎంత చక్కని విషయం ఇది” అన్నాను. నా ముందు వరుసలో కూర్చొన్న వ్యక్తి “ఇంతకంటే ముందు చెప్పింది దీని కన్నా మంచిది” అన్నాడు. నేను ఎవరా అని చూస్తే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు). ఆయన “నువ్వు ఇప్పుడే వచ్చినట్లున్నావు. (ఇంతకు ముందు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘మీలో ఎవరైనా ఉదూ ఆచరిస్తే, పరిపూర్ణంగా ఉదు పూర్తి చేసి, “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవ బడతాయి, వాటిలో అతను కోరుకున్న దాని ద్వారా స్వర్గములోనికి ప్రవేశించవచ్చు’ అన్నారు.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 234]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు రెండు గొప్ప ధార్మిక ఆచరణలను వివరించారు:
మొదటిది: ఎవరైతే ఉదూను ఆచరిస్తాడో మరియు దానిని చక్కగా, పూర్తిగా, సంపూర్ణంగా మరియు నిర్దేశించిన పద్ధతిలో పరిపూర్ణం చేసి, ప్రతి అవయవానికి దానికి తగిన మొత్తంలో నీటిని అందజేసి, అప్పుడు ఇలా: “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువ బడుతాయి. ఏ ద్వారము ద్వారా కోరుకుంటే ఆ ద్వారము నుండి అతడు స్వర్గములోనికి ప్రవేశించవచ్చు.”
రెండవది: ఎవరైతే ఉదూ చేయునపుడు ఉదూను పూర్తిగా, సంపూర్ణంగా ఆచరించి, తరువాత నిలబడి, రెండు రకాతులను, హృదయపూర్వకంగా మరియు వినయముతో వాటి వైపునకు తిరిగి, అతడి ముఖాన్ని మరియు శరీరంలోని అన్ని అవయవాలను అల్లాహ్ కే (ఆయన ఆరాధనకే) సమర్పించుకుని ఆచరిస్తాడో, స్వర్గం అతని కొరకు విధి (వాజిబ్) చేయబడుతుంది.

الملاحظة
السلام عليكم لم يتم شرح الجزء الأخير من الحديث (فتحت له أبواب الجنة الثمانية) جزاكم الله خيرا
النص المقترح لا يوجد...

من فوائد الحديث

  1. ఈ హదీథులో తన దాసునికి అతడు ఆచరించే చిన్న పనికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఇవ్వడంలో ఆయన యొక్క ఘనమైన కరుణ, దయ తెలుస్తున్నాయి.
  2. ఈ హదీథు ద్వారా – సంపూర్ణంగా ఉదూ చేయడం మరియు దానిని పరిపూర్తి చేయడం, తరువాత హృదయపూర్వకంగా, వినయంతో రెడు రకాతుల నమాజు ఆచరించడం షరియత్’లోని విషయమేనని, మరియు దానికి అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉన్నదని తెలియుచున్నది.
  3. పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, తరువాత పైన పేర్కొన్న దుఆ చదవడం స్వర్గములోనికి ప్రవేశార్హతను పొందే మార్గములలొ ఒకటి.
  4. ఉదూ ఆచరించిన వాని కొరకు పైన పేర్కొన్న దుఆ చదవడం అనేది అభిలషణీయమైనది.
  5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు (సహాబాలు) ఎప్పుడూ ఙ్ఞానసముపార్జన చేయుట మరియు ఙ్ఞానాన్ని వ్యాప్తి చేయు వంటి మంచిపనులలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవారు; అలాగే ఈ పనులలో, మరియు జీవనోపాధికి సంబంధించిన పనులలో ఒకరికొకరు బాగా సహకరించుకునే వారు.
  6. పరిపూర్ణంగా ఉదూ ఆచరించిన తరువాత అల్లాహ్ యొక్క స్మరణ చేయుట హృదయాన్ని పరిశుద్ధ పరుస్తుంది; షిర్క్ (బహుదైవారాధన) నుండి పరిశుభ్రపరుస్తుంది; ఏ విధంగానైతే ఉదూ శరీరాన్ని శుభ్రపరుస్తుంది, మరియు దాని నుండి మురికిని దూరం చేస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ పష్టో అస్సామీ السويدية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الصربية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా