«لاَ تَلْبَسُوا الحَرِيرَ وَلاَ الدِّيبَاجَ، وَلاَ تَشْرَبُوا فِي آنِيَةِ الذَّهَبِ وَالفِضَّةِ، وَلاَ تَأْكُلُوا فِي صِحَافِهَا، فَإِنَّهَا لَهُمْ فِي الدُّنْيَا وَلَنَا فِي الآخِرَةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5426]
المزيــد ...
అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబూ లైలా ఉల్లేఖనం : “మేము హుజైఫహ్ వద్ద కూర్చుని ఉన్నాము. అతడు నీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. ఒక మజూసీ అతనికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఎపుడైతే అతడు నీటి కప్పును అతని చేతిలో ఉంచినాడో, హుదైఫహ్ దానిని అతని పైకి విసిరినాడు. తరువాత ఇలా అన్నాడు: “అలా చేయవద్దని నేను ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అతనికి చెప్పి ఉండకపోతే...” “నేను ఇలా చేసి ఉండే వాడిని కాదు” అని అనాలని బహుశా ఆయన అనుకున్నాడు. (ఆయన ఇంకా ఇలా అన్నాడు) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను:
“పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించకండి, వెండి లేక బంగారపు పాత్రలలో నీళ్ళు త్రాగకండి, మరియు వాటితో చేసిన పళ్ళాలలో తినకండి; ఎందుకంటే (ఈ ప్రాపంచిక జీవితంలో) అవి వారి కొరకు (అవిశ్వాసుల కొరకు); మన కొరకు పరలోక జీవితంలో ఉన్నాయి.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5426]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను అన్ని రకాల పట్టు వస్త్రాలను ధరించుటనుండి నిషేధించినారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను, స్త్రీలను బంగారము లేక వెండి పళ్ళాలలో, పాత్రలలో తినుట మరియు త్రాగుట నుండి నిషేధించినారు. అవి (బంగారు మరియు వెండి పాత్రలు మొదలైనవి) పునరుత్థాన దినమున కేవలం విశ్వాసులకు మాత్రమే ప్రత్యేకించబడతాయి, ఎందుకంటే ఈ ఇహలోక జీవితములో అల్లాహ్ యొక్క విధేయతలో వారు వాటికి దూరంగా ఉన్నారు కనుక. అలాగే పరలోక జీవితం లో అవిశ్వాసులకు ఇవేవీ లభించవు, ఎందుకంటే వారు తమ ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ఆదేశానికి అవిధేయత చూపి, వేగిరపడి మంచిమంచి విషయాలను, విలాసాలను, సొంతం చేసుకుంటూ అనుభవించారు కనుక.