عن المِقدام بن معدي كرب رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«إِذَا أَحَبَّ الرَّجُلُ أَخَاهُ فَلْيُخْبِرْهُ أَنَّهُ يُحِبُّهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في السنن الكبرى وأحمد] - [سنن أبي داود: 5124]
المزيــد ...
మిఖ్'దామ్ బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఒక వ్యక్తి తన తోటి సోదరుడిని ప్రేమిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి తను ప్రేమిస్తున్న విషయాన్ని అతనికి తెలియ జేయాలి”.
[దృఢమైనది] - - [سنن أبي داود - 5124]
పరస్పరం విశ్వాసుల మధ్య ఉండే సంబంధాన్ని దృఢం గావించే మరియు వారి మధ్య ప్రేమను వ్యాపింప జేసే విషయాలలో ఒక దానిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీథులో వివరించినారు – అదేమిటంటే, ఒకవేళ ఎవరైనా తన సోదరుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, ఆ విషయాన్ని అతడికి తెలియ జేయటం.