عن أبي هريرة رضي الله عنه:
أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوْصِنِي، قَالَ: «لَا تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا قَالَ: «لَا تَغْضَبْ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6116]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “నాకు ఏమైనా బోధించండి” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని పలికారు. అతడు పలుమార్లు అదే ప్రశ్నను అడిగాడు. ప్రతీ సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని సమాధానమిచ్చారు.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6116]
సహబాలలో ఒకరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, తనకు ప్రయోజనం కలిగించే ఏదైనా విషయం వైపునకు మార్గదర్శకత్వం చేయమని కోరాడు. దానికి ఆయన “కోపం తెచ్చుకోకు (కోపానికి దూరంగా ఉండు)” అని అతణ్ణి ఆదేశించారు. దాని అర్థము తనను కోపానికి గురిచేసే ప్రతి కారణము నుండి దూరంగా ఉండమని, ఒకవేళ కోపం వచ్చినట్లయితే దానిని నియంత్రించు కోవాలని. అంతే గానీ, దానినే అంటిపెట్టుకుని ఉండి ఆ కోపంలో ఎవరినైనా చంపడమో, కొట్టడమో లేక అవమాన పరచడమో చేయరాదు అని అర్థము.
ఆ మనిషి తనకు ఏదైనా బోధించమనే తన అభ్యర్ధనను పలుమార్లు పునరావృతం చేసాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు (కోపానికి దూరంగా ఉండు)” అనే తన ఆదేశానికి ఇంకేమీ జోడించలేదు.