عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6114]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
"బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6114]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ - అసలైన శక్తి లేక బలం అంటే అది శరీర దారుఢ్యం వలన కలిగేది కాదు లేక బలశాలి అంటే ఇతర బలశాలులను చిత్తు చేసేవాడు కాేదు - అని వివరిస్తున్నారు. నిజానికి బలశాలి అంటే తీవ్రమైన కోపానికి లోనైనపుడు తనకు వ్యతిరేకంగా తానే పోరాడే వాడు, తనకు వ్యతిరేకంగా తానే శ్రమించేవాడు. ఎందుకంటే ఆ పోరాటం తనను తాను నియంత్రణలో ఉంచుకోవడం, తనను తాను అదుపులో ఉంచుకోవడం సాధ్యమయ్యేలా చేస్తుంది.