+ -

عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: يَا رَسُولَ اللهِ، مَا تَرَكْتُ حَاجَّةً وَلَا دَاجَّةً إِلَّا قَدْ أَتَيْتُ، قَالَ: «أَلَيْسَ تَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ؟» ثَلَاثَ مَرَّاتٍ. قَالَ: نَعَمْ، قَالَ: «فَإِنَّ ذَلِكَ يَأْتِي عَلَى ذَلِكَ».

[صحيح] - [رواه أبو يعلى والطبراني والضياء المقدسي] - [الأحاديث المختارة للضياء المقدسي: 1773]
المزيــد ...

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! చిన్న పాపము, పెద్ద పాపము అనే భేదం లేకుండా నేను చేయని పాపపు పని లేదు (మరి నేను క్షమించబడతానా?); దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని నీవు సాక్ష్యం పలుకలేదా?” అని అతడిని మూడు సార్లు ప్రశ్నించారు. దానికి అతడు “పలికాను” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నిశ్చయంగా అది (ఆ సాక్ష్యము పలుకుట అనేది), దీనిని జయిస్తుంది (నీ పాపలను తుడిచి వేస్తుంది)” అన్నారు.

[దృఢమైనది] - - [الأحاديث المختارة للضياء المقدسي - 1773]

వివరణ

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అనేక పాపపు పనులకు ఒడిగట్టాను, అనేక అవిధేయతలకు పాల్బడ్డాను. ఏ ఒక్క చిన్న పాపాన్నీ, ఏ ఒక్క పెద్ద పాపాన్నీ వదలలేదు. మరి నేను క్షమించబడతానా?” అని ప్రశ్నించాడు బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏం నీవు ‘అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరెవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు’ అని సాక్ష్యము పలుకలేదా?” అని తిరిగి అతడిని ప్రశ్నించారు. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని మూడు సార్లు ప్రశ్నించారు. అతడు “అవును, నేను సాక్ష్యము పలికాను” అని సమాధానం ఇచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’ (సాక్ష్యపు వాక్యములో ఉన్న రెండు సాక్ష్యపు పదబంధాలు) యొక్క ఘనతను వివరించారు, మరియు వాటిని ఉచ్ఛరించడం చెడు పనులకు పరిహారంగా అవుతుందని, మరియు అతడి పశ్చాత్తాపము అంతకు ముందు జరిగిన వాటిని హరిస్తుంది అని తెలియజేసారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ اليونانية الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసు ద్వారా ‘షహాదతైన్’ యొక్క గొప్పదనం, ఘనత తెలుస్తున్నాయి. మరియు ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ సాక్ష్యపు వాక్యాన్ని ఉచ్ఛరిస్తారో అతడి పూర్వపు చెడు పనులు, పాపాలు పరిహరించబడే అవకాశం ఉండడాన్ని గురించి తెలుస్తున్నది.
  2. ఇస్లాం ధర్మంలో ప్రవేశం అనేది పూర్వపు చెడుపనులను, పాపాలను తుడిచి వేస్తుంది.
  3. నిజాయితి తో కూడిన పశ్చాత్తాపము అంతకు ముందు జరిగిన దానిని తుడిచి వేస్తుంది.
  4. ఒక విషయాన్ని మరల మరల ఒత్తి పలకడం అనేది సహాబాలకు ఙ్ఞానాన్ని బోధించే పద్ధతిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాటించిన విధానం.
  5. ఇందులో షహాదతైన్ యొక్క ఘనత తెలుస్తున్నది, మరియు శాశ్వత నరక నివాసం నుండి తప్పించుకునే మార్గాలలో ఇది ఒకటి అని తెలుస్తున్నది.
ఇంకా