عن جرير بن عبد الله رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ لَا يَرْحَمِ النَّاسَ لَا يَرْحَمْهُ اللهُ عَزَّ وَجَلَّ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2319]
المزيــد ...
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు".
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2319]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలపై కరుణ చూపని వానిపై సర్వోన్నతుడైన అల్లాహ్ కూడా కరుణ చూపడు అని వివరిస్తున్నారు. కనుక దాసుడు అల్లాహ్ యొక్క సృష్టితాలపై కరుణ చూపడం అనేది, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ పొందే మార్గాలలో అత్యుత్తమమైన మార్గము.