+ -

عن أبي سعيد الخُدْريِّ رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«‌مَنْ ‌رَأَى ‌مِنْكُمْ ‌مُنْكَرًا فَلْيُغَيِّرْهُ بِيَدِهِ، فَإِنْ لَمْ يَسْتَطِعْ فَبِلِسَانِهِ، فَإِنْ لَمْ يَسْتَطِعْ فَبِقَلْبِهِ، وَذَلِكَ أَضْعَفُ الْإِيمَانِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 49]
المزيــد ...

అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను:
“మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 49]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నిషేధించిన ప్రతి చెడును, ప్రతి ఒక్కరూ తన సమర్థతను బట్టి ఆపాలి అని ఆదేశిస్తున్నారు. ఒకవేళ అతడు ఏదైనా చెడును చూసినట్లయితే, అతడు దానిని చేతితో ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉంటే (అంటే దానిని చేతితో అడ్డుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటే) అతడు తప్పనిసరిగా అలా చేయాలి. ఒకవేళ అతడు చేతితో ఆ చెడును ఆపలేకపోతే, అతడు ఆ పనిని తన నాలుకతో ఆపాలి. (నాలుకతో ఆపడం అంటే) ఆ చెడును చేస్తున్న వానికి అతడు చేస్తున్నది చెడు అని, తద్వారా అతడు కలుగజేస్తున్న కీడును గురించి అతడికి వివరించాలి, అతడికి మంచి వైపునకు మార్గ దర్శనం చేయాలి. ఒకవేళ అతనిలో అంత సమర్థత కూడా లేనట్లయితే, అపుడు కనీసం అతడు తన మనసులోనైనా ఆ జరుగుతున్న చెడును అసహ్యించుకుని, దానిని అడ్డుకోగలిగే సమర్థత గనక తనకు ఉండి ఉంటే దానిని తప్పనిసరిగా అడ్డుకుంటాను అని సంకల్పం చేసుకోవాలి. చెడును అడ్డుకుని, దానిని మార్చగలిగే సామర్థ్యపు స్థాయిలలో, మనసు యొక్క స్థాయి అత్యంత బలహీనమైన స్థాయి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада Озарӣ الأوزبكية الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. చెడును అడ్డుకుని దానిని మార్చే సామర్థ్యపు స్థాయిలకు సంబంధించి ఈ హదీసు ఒక ప్రకటన వంటిది.
  2. ఇందులో చెడును అడ్డుకుని దానిని మార్చే సమర్థత, సామర్థ్యములకు సంబంధించి ఒక క్రమానుగతం కనిపిస్తుంది.
  3. చెడును అడ్డుకొనుట అనేది ధర్మములో ఒక ఉత్తమమైన అధ్యాయము వంటిది. అది ఒక ముస్లిం నుండి ఎన్నటికీ దూరం కాదు. కనుక తన శక్తి, సామర్థ్యము, సమర్థతలను అనుసరించి తన ఎదుట జరిగే చెడును అడ్డుకొనుట ప్రతి ముస్లిం యొక్క విధి.
  4. మంచి చేయమని ఆదేశించుట, చెడును నిరోధించు విశ్వాసపు ముఖ్య లక్షణాలు. మరియు విశ్వాసములో హెచ్చుతగ్గులు ఉంటాయి.
  5. చెడును నిరోధించడానికి అవసరమైన ముఖ్య విషయం ఏమిటంటే: అది చెడు అనే ఙ్ఞానము కలిగి ఉండుట.
  6. చెడును అడ్డుకుని దానిని మార్చే విషయానికి సంబంధించి ఒక ముఖ్య నియమం: అదేమిటంటే, ఒక చెడు దాని కంటే ఎక్కువ చెడుకు దారి తీయరాదు.
  7. చెడును అడ్డుకొనుట, దానిని ఆపుట అనేది ఒక విధానం ప్రకారం, కొన్ని నియమాలను అనుసరించి జరగాలి. ప్రతి ముస్లిం వాటిని నేర్చుకోవాలి.
  8. ఒక విషయాన్ని చెడుగా నిర్థారించి, దానిని నిరాకరించడానికి రాజకీయ విధానం, లోతైన అవగాహన మరియు ఙ్ఞానము అవసరం.
  9. మనస్సులోనైనా చెడును నిరాకరించక పోవడం – అది విశ్వాసపు బలహీనతను సూచిస్తుంది.
ఇంకా