عن ابنِ عُمَرَ رضي الله عنهما قال: قال رسولُ الله صلَّى الله عليه وسلم:
«مَن تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ».
[حسن] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 4031]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఇలా పలికినారు
"ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".
[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 4031]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఏదైనా ఒక జాతివారిని అనుకరించే వారి గురించి వివరిస్తున్నారు. ఉదాహరణకు అవిశ్వాసుల సమూహాన్ని లేదా క్రైస్తవుల సమూహాన్ని (జాతిని) అనుకరించేవారు లేదా ధార్మికులైన ప్రజల సమూహాన్ని అనుకరించేవారు - ఇలా ఏదైనా ఒక జాతిని, సమూహాన్ని వారి లక్షణాలలో, వారి స్వభావం లో, వారి గుణాణాలలో లేక వారి విశ్వాసాలలో, వారి ఆరాధనా పధ్ధతులలో లేక వారి ఆచార వ్యవహారాలలో వారిని అనుకరించినట్లయితే - అలా అనుకరించిన వారు, అనుకరించబడిన జాతి లేక సమూహములోని వారు అవుతారు. ఎందుకంటే వారిని బాహ్యంగా అనుకరించడం, అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి దారితీస్తుంది. ఎవరినైనా ఏదైనా విషయం లో అనుకరించడం అనేది ఆ విషయం పట్ల మనలోని ప్రశంసాత్మక వైఖరి, హర్షాతిరేకము మొదలైన వాటి కారణంగా మొదలవుతుంది. అది ఆ విషయాలను ప్రేమించేందుకు, వాటి పట్ల భక్తి శ్రద్ధలకు, వాటిపై ఆధారపడుటకు దారి తీయవచ్చు. ఇంకా అది మన అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి, ఆరాధించడానికి దారి తీయవచ్చు. అల్లాహ్ క్షమించుగాక.