عن المقدام بن معدِيْكَرِب رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«أَلَا هَلْ عَسَى رَجُلٌ يَبْلُغُهُ الْحَدِيثُ عَنِّي وَهُوَ مُتَّكِئٌ عَلَى أَرِيكَتِهِ فَيَقُولُ: بَيْنَنَا وَبَيْنَكُمْ كِتَابُ اللهِ، فَمَا وَجَدْنَا فِيهِ حَلَالًا اسْتَحْلَلْنَاهُ، وَمَا وَجَدْنَا فِيهِ حَرَامًا حَرَّمْنَاهُ، وَإِنَّ مَا حَرَّمَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَمَا حَرَّمَ اللهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه] - [سنن الترمذي: 2664]
المزيــد ...
మిఖ్'దాం బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు :
“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.
[దృఢమైనది] - - [سنن الترمذي - 2664]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సమీప భవిష్యత్తులో ఇలాంటి ఒక కాలం రాబోతున్నది. అందులో – కొంత మంది ప్రజలు కూర్చుని ఉంటారు, ఒకడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఉంటాడు. అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసు తెలియజేయబడుతుంది. దానికి అతడు ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్య తీర్పు చెప్పేది ఏదైనా ఉంది అంటే అది ‘అల్ ఖుర్’ఆన్ అల్ కరీం’. అది చాలు మాకు. అందులో మాకు ఆచరించవలసిన విషయాలుగా (హలాల్ విషయాలుగా) కనిపించిన అంతటిపై మేము ఆచరిస్తాము, మరియు అందులో నిషేధించబడిన విషయాలుగా (హరాం విషయాలుగా) కనిపించిన దానినుండి దూరంగా ఉంటాము. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – తన సున్నత్’లో తాను నిషేధించిన ఏ విషయమైనా లేదా తాను నిరోధించిన ఏ విషయమైనా, అది అల్లాహ్ తన గ్రంథములో నిషేధిస్తూ ఆదేశించిన దానితో సమానం. ఎందుకంటే ప్రతిదీ తాను తన ప్రభువు నుండే అంద జేస్తున్నాడు గనుక.