عن أبي أيوب الأنصاري رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَا يَحِلُّ لِرَجُلٍ أَنْ يَهْجُرَ أَخَاهُ فَوْقَ ثَلَاثِ لَيَالٍ، يَلْتَقِيَانِ، فَيُعْرِضُ هَذَا وَيُعْرِضُ هَذَا، وَخَيْرُهُمَا الَّذِي يَبْدَأُ بِالسَّلَامِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6077]
المزيــد ...
అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6077]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపంలో ఒకరినుంచి ఒకరు దూరమై పోయే ముస్లిములను గురించి వివరిస్తున్నారు. కోపంలో ఒక ముస్లిం తన తోటి ముస్లింను మూడు రాత్రుల కంటే ఎక్కువ దినాలు వదిలి వేయడం నిషేధించబడింది. వారు ఒకరికొకరు తారస పడుతున్నా కోపం కారణంగా సలాం చేసుకోరు, మాట్లాడుకోరు.
వీరిద్దరిలో ఉత్తమమైన వారు ఎవరంటే ఎవరైతే తమ మధ్య పెరిగిన దూరాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తాడో మరియు ‘సలాం’తో మరలా కలవడానికి ప్రయత్నం మొదలు పెడతాడో. ఇక్కడ పెరిగిన దూరం అంటే, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య కోపం కారణంగా పెరిగిన దూరం. అదే అల్లాహ్ హక్కు కొరకు ఎవరితోనైనా దూరం పెంచు కున్నట్లయితే అంటే ఉదాహరణకు – అల్లాహ్’కు అవిధేయత చూపేవానితో దూరం పెంచుకొనుట, ధర్మములో కొత్త విషయాలను సృష్టించే వానితో దూరం పెంచుకొనుట లేదా చెడు సహవాసులతో దూరంంగా ఉండుట – ఈ విధమైన దూరానికి సమయం (ఇన్ని రోజులు) అనేది వర్తించదు. ఆ దూరం తొలగి పోవడం అనేది వారిలో నుండి ఆ చెడులక్షణాలు దూరం కావడం పై ఆధారపడి ఉంటుంది.