+ -

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«قَالَ اللهُ تَبَارَكَ وَتَعَالَى: أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ، مَنْ عَمِلَ عَمَلًا أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي تَرَكْتُهُ وَشِرْكَهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2985]
المزيــد ...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2985]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు – ‘’అష్-షిర్క్’ కు (బహుదైవారాధనకు) సంబంధించి అల్లాహ్ ఇలా అంటున్నాడు; "తన సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినైనా కలిగి ఉండవలసిన అవసరం ఏమాత్రమూ లేని వాడు ఆయన; ఎందుకంటే ఏ విషయానికి సంబంధించైనా ఆయన అత్యంత స్వయం సమృధ్ధుడు. అందుకని ఎవరైనా విధేయతకు సంబంధించి ఏదైనా ఆచరణ అల్లాహ్ కొరకు ఆచరించి అందులో ఇతరులను కూడా అల్లాహ్ కు సాటి కల్పించినట్లయితే, అల్లాహ్ దానిని వదిలి వేస్తాడు, స్వీకరించడు, మరియు ఆ ఆచరణను అంటే అతడిని, సాటి కల్పించిన వానికే వదిలివేస్తాడు. కనుక విధేయతకు చెందిన ఏ ఆచరణ అయినా, అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే పరమ పవిత్రుడైన ఆయన కేవలం తన కొరకు మాత్రమే ప్రత్యేకించబడిన ఆచరణను తప్ప మరి దేనినీ స్వీకరించడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада Озарӣ الأوزبكية الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో బహుదైవారాధన, అది ఏ రూపంలో ఉన్నా సరే, దానికి వ్యతిరేకంగా ఒక హెచ్చరిక ఉన్నది. ఆచరణలు అల్లాహ్ వద్ద స్వీకరించబడడానికి అది ఒక పెద్ద ఆటంకంగా మారుతుందని అర్థమవుతున్నది.
  2. అల్లాహ్ అత్యంత ఘనమైన వాడు మరియు అత్యంత స్వయం సమృధ్ధుడు అనే చైతన్యం ఎల్లవేళలా కలిగి ఉండ వలెను. అది విధేయతకు సంబంధించిన ఆచరణలు కేవలం ఆయన కొరకే అయి ఉండాలనే ఆలోచనకు బలాన్ని, స్థిరత్వాన్ని చేకూరుస్తుంది.
ఇంకా