عن جندب رضي الله عنه قال:
سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَبْلَ أَنْ يَمُوتَ بِخَمْسٍ وَهُوَ يَقُولُ «إِنِّي أَبْرَأُ إِلَى اللهِ أَنْ يَكُونَ لِي مِنْكُمْ خَلِيلٌ فَإِنَّ اللهَ تَعَالَى قَدِ اتَّخَذَنِي خَلِيلًا كَمَا اتَّخَذَ إِبْرَاهِيمَ خَلِيلًا، وَلَوْ كُنْتُ مُتَّخِذًا مِنْ أُمَّتِي خَلِيلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيلًا! أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ! إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 532]
المزيــد ...
జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ఇలా అన్నారు:
“తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు. ఒకవేళ నా సహచర సమాజం (ఉమ్మత్) నుండి నేను ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకోవాలని అనుకుంటే, నేను అబూబక్ర్ రజియల్లాహు అన్హును నా ఆప్త మిత్రునిగా చేసుకుని ఉండే వాడిని. తస్మాత్, జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా (సజ్దా చేసే స్థలాలుగా) చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 532]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వోన్నతుడైన అల్లాహ్ వద్ద తన స్థానము ఎంత ఉన్నతమైనదో తెలియ జేస్తున్నారు. (తన పట్ల అల్లాహ్ యొక్క) ప్రేమాభిమానములు అత్యున్నత స్థానమును చేరుకున్న విషయాన్ని తెలియ జేస్తున్నారు, ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ స్థానాన్ని పొందినారో. అందుకని తనకు ఒక ఆప్తమిత్రునిగా అల్లాహ్ తప్ప మరొకరు ఉండడం అనే విషయాన్ని నిరాకరించినారు. ఎందుకంటే ఆయన హృదయం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ప్రేమతో, ఆయన ఘనతతో, ఆయన ఉనికితో ఎంత సంపూర్ణంగా నిండి పోయి ఉన్నది అంటే, ఇక అల్లాహ్ తప్ప మరొకరికి ఏమాత్రమూ స్థానము లేనంతగా. మరియు ఒకవేళ ఈ సృష్టిలో తనకు ఎవరైనా ఆప్త మిత్రుడు ఉండి ఉండేటట్లయితే, అది అబూ బక్ర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హు అయి ఉండే వారని తెలియజేస్తున్నారు. ఇంకా, యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల మరియు సత్పురుషుల పట్ల ఉండవలసిన ప్రేమాభిమానాల విషయంలో అనుమతించిబడిన హద్దులు దాటి, వారి సమాధులను ఏవిధంగానైతే పూజా స్థలాలుగా చేసుకున్నారో; అల్లాహ్ ను వదిలి ఆ సమాధులను, పూజించబడే దైవాలుగా మార్చివేసారో, అలా చేయడం నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా హెచ్చరించినారు. ఇంకా వారు (యూదులు, క్రైస్తవులు) తమ ప్రవక్తల, సత్పురుషుల సమాధులపై (పెద్ద పెద్ద ఆకారాలలో) ఆరాధనాలయాలు (పూజా గృహాలు), దేవాలయాలు నిర్మించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను వారి మాదిరిగా చేయడం నుండి నిషేధించినారు.