عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ، ابْنُ جُدْعَانَ كَانَ فِي الْجَاهِلِيَّةِ يَصِلُ الرَّحِمَ، وَيُطْعِمُ الْمِسْكِينَ، فَهَلْ ذَاكَ نَافِعُهُ؟ قَالَ: «لَا يَنْفَعُهُ، إِنَّهُ لَمْ يَقُلْ يَوْمًا: رَبِّ اغْفِرْ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 214]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను “ఓ రసూలుల్లాహ్! ఇబ్నె జుదాన్ బంధాలను, బాంధవ్యాలను గౌరవించేవాడు, వాటిని నిలిపి ఉంచేవాడు, కొనసాగించేవాడు, మరియు (ఇస్లాం కు పూర్వపు) అఙ్ఞాన కాలములో పేదవారికి అన్నం తినిపించేవాడు. ఇది (ఈ మంచిపనులు) అతనికి ఏమైనా ప్రయోజనాన్ని కలుగజేస్తుందా?” దానికి ఆయన “ఇది అతనికి ఏమీ ప్రయోజనం కలుగజేయదు, ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 214]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్నె జుదాన్’ను గురించి తెలియ జేస్తున్నారు. ఇస్లాం కు పూర్వం అతడు ఖురైషీ తెగ యొక్క నాయకులలోని ఒక ప్రముఖ నాయకుడు. అతడు కష్టాలలో ఉన్న తన బంధువుల దగ్గరకు స్వయంగా వెళ్ళి వారికి సహాయం చేసేవాడు, పేదలకు అన్నం తినిపించేవాడు. ఇస్లాం ధర్మం తన అనుయాయులను ఆచరించమని ఆదేశించిన ఉత్తమ ఆచరణలను అన్నింటినీ అతడు (ఇస్లాం ధర్మానికి పూర్వం) ఆచరించేవాడు. అయినా అది అంతిమ దినమున అతనికి ఏమాత్రమూ ప్రయోజనం కలిగించదు. ఇది ఎందుకంటే అతడు అల్లాహ్ నందు విశ్వసించలేదు. ఎన్నడూ అతడు “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా తప్పులను, పాపాలను క్షమించు” అని వేడుకోలేదు.